ETV Bharat / bharat

హెల్పర్​ను చంపి.. శవాన్ని మాయం చేసి.. 7 నెలలు పోలీసులకు చుక్కలు

author img

By

Published : May 6, 2022, 10:04 PM IST

Gurugram murder
హెల్పర్​ను చంపి.. శవాన్ని మాయం చేసి.. 7 నెలలు పోలీసులకు చుక్కలు

హెల్పర్​ను చంపి శవాన్ని మాయం చేసి ఏడు నెలలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు ఓ యజమాని. చివరకు పోలీసులు నిజాన్ని పసిగట్టి ఈ హత్యతో సంబంధమున్న నలుగురిని అరెస్టు చేశారు. హరియాణా గురుగ్రామ్​లో ఈ ఘటన జరిగింది.

Gurugram murder: హరియాణా గురుగ్రామ్​లోని రేవాడీలో ఓ హత్య కేసును 7 నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తప్పుదోవ పట్టించడం వల్లే దర్యాప్తు ఆలస్యమైందని శుక్రవారం తెలిపారు. ఆక్టోబర్​ నుంచి దర్యాప్తు చేస్తున్న హత్య కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్​లో హత్యకు గురైన వ్యక్తి పేరు అజయ్ అలియాస్ గోలు. సెక్టార్​ 52లోని బాలాజీ మెడికల్ స్టోర్​లో హెల్పర్​గా పనిచేసేవాడు. గతేడాది ఈ దుకాణంలో మూడు మొబైల్ ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిని అజయ్​ దొంగిలించి ఉంటాడని మెడికల్ షాపు యజమాని అమిత్ అనుమానించాడు. దీంతో అజయ్​ను మూడు రోజుల పాటు నిర్బంధించి హింసించాడు. ఆ తర్వాత అజయ్​ తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్​ 8న అజయ్​ను మళ్లీ తీసుకెళ్లి నిర్బంధించాడు అమిత్​. ఈసారి అజయ్ తండ్రి సత్యపాల్​ను కూడా బంధించాడు. మూడు రోజుల తర్వాత అజయ్ తండ్రిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు తన కుమారుడి ఆచూకీ తెలపాలని సత్యపాల్ అమిత్​కు ఫోన్ చేశాడు. అయితే అజయ్​ తన వద్ద నుంచి తప్పించుకున్నాడని అమిత్ బదులిచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదే సమాధానం చెప్పాడు.

కొడుకు ఎన్నిరోజులు గడిచినా ఇంటికి రాకపోవడం వల్ల సత్యపాల్​కు అనుమానం వచ్చింది. దీంతో పోలీస్​ స్టేషన్​కు వెళ్లి అమిత్​పై కిడ్నాప్ కేసు పెట్టాడు. అయితే పోలీసులకు కూడా అమిత్ ఇదే విషయం చెప్పి నమ్మించాడు. కానీ 7 నెలల తర్వాత అజయ్ శవం లభ్యమైంది. అనంతరం మెడికల్ స్టోర్ యజమాని అమిత్​తో పాటు నిశాంత్, అరున్​, రుబాల్​ను గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది. అజయ్​ను తీవ్రంగా హింసించడం వల్ల అతను చనిపోయాడని, విషయం బయటకు రాకుండా అతని శవాన్ని ఓ వాహనంలో పెట్టి ఆరాం నగర్​లో పాతిపెట్టామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

ఇదీ చదవండి: పట్టపగలే బ్యాంకు దోపిడీ.. కస్టమర్లలా వచ్చి రూ.లక్షలు లూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.