తెలంగాణ

telangana

భార్యతో అసహజ రీతిలో శృంగారం.. రివాల్వర్​తో బెదిరించి చివరకు..

By

Published : Sep 10, 2022, 9:50 PM IST

భర్త అసహజ రీతిలో తనతో శృంగారం చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. నిరాకరిస్తే బెదిరించేవాడని పేర్కొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది.

husband harassed wife
husband harassed wife with unnatural sex in gwalior of madhyapradesh

భర్త తనతో అసహజ రీతిలో శృంగారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. నిరాకరిస్తే రివాల్వర్​తో బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఆ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ నగరంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్వాలియర్ నగరంలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల ఓ ప్రముఖ మహిళా అధికారిణికి అదే నగరానికి చెందిన వ్యక్తితో 2020లో వివాహం అయింది. పెళ్లైన తర్వాత కొద్ది రోజులు బాగానే గడిచాయి. ఆ తర్వాత నుంచి భార్యను వేధించేవాడు. ఆమెతో అసహజంగా శృంగారం చేసేవాడు. భార్య ప్రతిఘటించిన ప్రతిసారి ఛాతీపై తుపాకీని పెట్టి బెదిరించేవాడు. ఆపై కొట్టేవాడు. తర్వాత అనుమతి లేకుండా బలవంతంగా అసహజంగా శృంగారం చేసేవాడు.

ఇదే కాకుండా వరకట్నం కోసం కూడా తనను నిత్యం హింసించేవాడని ఆమె పోలీసుల ముందు వాపోయింది. భర్త వేధింపుల వల్ల మానసికంగా కూడా ఇబ్బంది పడినట్లు వివరించింది. దీంతో చివరకు తట్టుకోలేక ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆమె భర్తపై అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details