ETV Bharat / bharat

లిజ్​ ట్రస్​తో ఫోన్​లో మాట్లాడిన మోదీ.. రాణి మృతికి సంతాపం

author img

By

Published : Sep 10, 2022, 8:09 PM IST

ఇటీవల బ్రిటన్​ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాణి ఎలిజబెత్-​2 మృతి పట్ల సంతాపం తెలియజేశారు. త్వరలో నేతలిద్దరూ ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు.

Prime Minister Narendra liz Truss Modi
Prime Minister Narendra Modi spoke on phone today with British PM Elizabeth Truss

బ్రిటన్​ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్​ ట్రస్​తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాణి ఎలిజబెత్​-2 మృతి పట్ల బ్రిటన్ రాజ కుటుంబానికి, యూకే ప్రజలకు భారత ప్రజల తరపున మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానిగా ఎన్నికైనందుకు ట్రస్​కు అభినందనలు తెలిపారు. యూకే విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల దైపాక్షిక సంబంధాల విషయంలో ఆమె చేసిన కృషిని అభినందించారు. త్వరలో తాము ప్రత్యక్షంగా సమావేశం కానున్నట్టు ఇరు దేశాల నేతలు వెల్లడించారు.

భారత్​-యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపరచడానికి ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2030 రోడ్‌మ్యాప్ అమలులో పురోగతి, కొనసాగుతున్న ఎఫ్​టీఏ చర్చలు, రక్షణ-భద్రత సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక ఆసక్తికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారని తెలిపింది.

ఇవీ చదవండి: భారత్​లో బ్రిటన్​ హోంమంత్రి భూముల ఆక్రమణ.. ఎక్కడంటే?

ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.