తెలంగాణ

telangana

'నేషనల్‌ హెరాల్డ్‌ కేసు తేల్చండి'

By

Published : Dec 24, 2020, 9:11 AM IST

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయిల వసూలు కేసు విచారణ ముందుకు సాగకుండా భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అస్పష్టమైన అభ్యర్థనలు చేస్తూ విచారణ ముందుకు సాగనీయడంలేదన్నారు.

Swamy delaying proceedings, Gandhis tells court
నేషనల్‌ హెరాల్డ్‌ కేసు

ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసు ముందుకు సాగకుండా భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ కేసులో వివిధ పత్రాలను, సాక్షులను ప్రవేశపెట్టాలని కోరుతూ స్వామి దరఖాస్తు చేసినా సాక్షుల జాబితాను జతచేయలేదని విమర్శించారు. గతంలో కోర్టుకు హాజరైన సమయంలోనూ పిటిషన్‌దారు ఆ వివరాలను సమర్పించలేదని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తును కొట్టివేయాలని బుధవారం వారిద్దరూ న్యాయస్థానాన్ని కోరారు.

ఇదీ కేసు..

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రై.లి.ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే, ఈ కేసు విచారణను జాప్యం చేసేందుకు సుబ్రమణ్య స్వామి ప్రయతిస్తున్నారని సోనియా, రాహుల్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణ జనవరి 12వ తేదీకి వాయిదాపడింది.

ఇదీ చదవండి: సాగు చట్టాలపై రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details