తెలంగాణ

telangana

సతీమణితో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా

By

Published : Aug 13, 2022, 12:15 PM IST

Updated : Aug 13, 2022, 12:40 PM IST

Har Ghar Tiranga ఇంటింటా తిరంగ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు.

har-ghar-tiranga-campaign-kicks-off-today
har-ghar-tiranga-campaign-kicks-off-today

Har Ghar Tiranga దేశవ్యాప్తంగా హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన నివాసంపై జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. తన సతీమణితో కలిసి హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అసోం సీఎం హిమంతా బిశ్వ శర్మ త్రివర్ణ పతాకాన్ని చేతబూని పాదయాత్ర నిర్వహించారు. ఆయనతో పాటు వందలాది మంది విద్యార్థులు, జాతీయ జెండా పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.

త్రివర్ణ పతాకం ఎగురవేస్తున్న అమిత్ షా
అమిత్ షా
హిమంత బిశ్వశర్మ ర్యాలీ

జాతీయ జెండా రెపరెపలు దేశ సరిహద్దుల్లోని హిమాలయాలను తాకింది. భారత్‌ చైనా సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లో ఐటీబీపీ బలగాలు మువ్వన్నెల జెండాను ఎగురవేశాయి. భూమికి 18,400 అడుగుల ఎత్తున జాతీయ జెండాను సగర్వంగా నిలబెట్టాయి. ఉత్తరాఖండ్‌లో భూమికి 14వేల అడుగుల ఎత్తున సైన్యం త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించింది. జెండాకు సెల్యూట్‌ చేసి కేంద్రం పిలుపునిచ్చిన హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో సైన్యం పాలుపంచుకుంది.

ఐటీబీపీ జవాన్లు
హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు

బద్రినాథ్‌ ఆలయం పరిసరాల్లోనూ జాతీయ జెండా రెపరెపలాడింది. సైన్యంతో పాటు భక్తులు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో... భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ముంబయిలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్​బీఐ ఛైర్మన్‌ దినేశ్ కుమార్ ఖారా సైకిల్‌ తొక్కి ర్యాలీని ప్రారంభించారు.

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
గోవా సీఎం ప్రమోద్ సావంత్
Last Updated : Aug 13, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details