తెలంగాణ

telangana

కాంక్రీట్ మిక్సర్​తో పిండి కలిపి వంటలు.. 2లక్షల మందికి అన్నదానం!

By

Published : Dec 12, 2021, 6:10 PM IST

Updated : Dec 12, 2021, 6:29 PM IST

Food Made In Concrete Mixer: మధ్యప్రదేశ్​లోని మౌనీ బాబా ఆశ్రమంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కరోజే దాదాపు 2లక్షలమందికి పైగా భక్తులకు భోజనం అందించారు నిర్వాహకులు. వంటలు చేయడానికి కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వాడటం విశేషం.

Food Made In Concrete Mixture
కాంక్రీట్ మిక్సర్ యంత్రంలో ఆహారం తయారీ

కాంక్రీట్ మిక్సర్​తో పిండి కలిపి వంటలు

Food Made In Concrete Mixer: మధ్యప్రదేశ్​, మోరెనా జిల్లా చంబల్​ ప్రాంతంలోని మౌనీ బాబా ఆశ్రమంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవత్ కథా చివరి రోజు సందర్భంగా శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 2 లక్షలకుపైగా భక్తులు పాల్గొని భోజనం చేశారు.

కాంక్రీట్ మిక్సర్​ యంత్రం​లో పిండి కలిపి..

లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడం వల్ల ఆహారం త్వరగా తయారు చేసేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని ఉపయోగించారు. మల్పువా(ఓ రకం మిఠాయి) పిండిని కాంక్రీట్ మిక్సర్ యంత్రం​లో వేసి కలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. 15 ట్రాలీల సాయంతో భోజనం సరఫరా చేశారు.

100 గ్రామాల నుంచి ప్రజలు..

దాదాపు 100 గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలను తీసుకొచ్చారని నిర్వాహకులు తెలిపారు. పెద్ద పెద్ద కడాయిల్లో ఆహారం తయారు చేసినట్లు చెప్పారు. శనివారం ఉదయం 11 నుంచి రాత్రి 11వరకు అన్నదాన కార్యక్రమం జరిగినట్లు వివరించారు.

దాదాపు 2లక్షల మందికిపైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఆశ్రమం వద్ద మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చూడండి:రైతులకు ఏడాది ఫ్రీగా భోజనం పెట్టిన లంగర్​.. ఇకపై రెస్టారెంట్​!

Last Updated :Dec 12, 2021, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details