తెలంగాణ

telangana

ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

By

Published : Dec 31, 2021, 12:59 PM IST

Updated : Dec 31, 2021, 2:29 PM IST

उदयपुर में ओमिक्रोन संक्रमित रहे 73 साल के बुजुर्ग की मौत हो गई है. उनका इलाज चल रहा था. उनकी मेडिकल हिस्ट्री के मुताबिक वो कोरोना से डबल नेगेटिव हो चुके थे.

first omicran death in India
దేశంలో మొదటి ఒమిక్రాన్​ మరణం నమోదు

12:53 December 31

రాజస్థాన్​లో వృద్ధుడు మృతి

India Omicron death: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న 73 ఏళ్ల వృద్ధుడు.. ఉదయ్​పుర్​ ఆసుపత్రిలో శుక్రవారం మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు. డిసెంబరు 21, 25 తేదీల్లో ఆ వ్యక్తికి రెండుసార్లు ఒమిక్రాన్​ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.

చనిపోయిన వ్యక్తి పోస్ట్-కొవిడ్ నిమోనియాతో బాధపడుతున్నాడని ఉదయపుర్​ సీఎంహెచ్​ఓ డాక్టర్ దినేష్ ఖాధ్రీ వివరించారు. డయాబెటిస్ మెల్లిటస్, హైపర్‌టెన్షన్​ తో పాటు హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. పోస్ట్​ కొవిడ్​ నిమోనియా కారణంగా ఆ వృద్ధుడు చనిపోయినట్లు స్పష్టం చేశారు.

డిసెంబరు 15న ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని... ఈ క్రమంలోనే జ్వరం, దగ్గు, రినైటిస్‌ వంటి లక్షణాలతో బాధపడుతుండడం కారణంగా ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు.

ఉదయ్​పుర్​లో ఇప్పటి వరకు 3 ఒమిక్రాన్​ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్​ రాష్ట్రంలో మొత్తం 69 కేసులు వెలుగు చూశాయి.

Last Updated :Dec 31, 2021, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details