తెలంగాణ

telangana

ఆత్మరక్షణకై చిరుతను కొట్టి చంపిన రైతులు

By

Published : Mar 24, 2021, 1:02 PM IST

పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులపై చిరుతపులి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం ఆ వన్యమృగాన్ని వారిద్దరూ కలిసి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Farmer killed Leopard to escape from attack
ప్రాణాలు రక్షించుకునేందుకు చిరుతను చంపిన రైతులు

తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ చిరుత పులిని చంపేశారు ఇద్దరు రైతులు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లా బులపురలో జరిగింది.

గాయాలతో బయటపడి...

గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు బుధవారం ఉదయం 3 గంటలకు పొలానికి వెళ్లగా ఓ చిరుత పులి వారిపై దాడి చేసింది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చిరుతపై తిరిగి దాడి చేశారు. ఓ బండ రాయితో ఆ వన్యమృగాన్ని కొట్టారు. కాసేపటి తర్వాత ఆ చిరుత అక్కడే కన్నుమూసింది.

ఈ ఘటనలో గాడిగెప్పకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆయనను చిత్రదుర్గ ఆసుపత్రిలో చేర్పించామని స్థానికులు తెలిపారు. క్రిష్ణగప్పకు స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నారు.

రాయితో చిరుతను కొట్టి చంపిన రైతులు
తీవ్రగాయాలతో గాడిగెప్ప
స్వల్ప గాయాలతో బయటపడ్డ క్రిష్ణప్ప

ఇదీ చదవండి:200 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details