తెలంగాణ

telangana

TS Engineering counseling schedule 2023 : ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

By

Published : May 27, 2023, 3:26 PM IST

Updated : May 27, 2023, 4:48 PM IST

Engineering
Engineering

15:18 May 27

జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు

TS Engineering Counselling schedule 2023 : తెలంగాణలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుండగా, జూన్ 26న ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇక జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 21 నుంచి మొదలవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ, జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలు పెడతారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 27, 2023, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details