తెలంగాణ

telangana

మహారాష్ట్ర సీఎంగా శిందే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడణవీస్

By

Published : Jun 30, 2022, 7:38 PM IST

Updated : Jun 30, 2022, 10:58 PM IST

Maharashtra CM Eknath shinde oath: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు.

eknath-shinde-oath-ceremony
eknath-shinde-oath-ceremony

Eknath shinde oath ceremony: శివసేన రెబల్ నేత ఏక్​నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

మహారాష్ట్ర సీఎంగా శిందే ప్రమాణం

అంతకుముందు భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు ఏక్​నాథ్ శిందే. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి.. ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన.. భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. అనూహ్యంగా శిందేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఫడణవీస్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడణవీస్ ప్రకటించగా.. భాజపా హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఫడణవీస్.. డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

ఠాక్రే శుభాకాంక్షలు..
ముఖ్యమంత్రి శిందేకు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుభాకాంక్షలు చెప్పారు. మహారాష్ట్రకు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 30, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details