తెలంగాణ

telangana

'ఆ పార్టీలను రద్దు చేసేందుకు అధికారం ఇవ్వండి'

By

Published : Sep 9, 2021, 5:35 AM IST

క్రియారహితంగా ఉన్న రాజకీయ పార్టీలను రద్దు చేసే అధికారం కల్పించాలని ఈసీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. విరాళాలపై ఆదాయపు రాయితీలు పొందడానికి మాత్రమే ఇవన్నీ రాజకీయ పార్టీల ముసుగును తొడుక్కున్నట్లు ఈసీ అనుమానిస్తోంది.

election commission
'ఆ పార్టీలను రద్దు చేసేందుకు అధికారం ఇవ్వండి'

రాజకీయ పార్టీల్లో కొన్ని మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుండగా మిగిలినవి క్రియారహితంగా ఉండడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. చట్టాన్ని సవరించి, తమకు అధికారం కల్పిస్తే ఇలాంటి పార్టీలను రద్దు చేస్తామని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. చాలా ఏళ్ల నుంచి ఈ ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ వద్ద పెండింగులో ఉంది. విరాళాలపై ఆదాయపు రాయితీలు పొందడానికి మాత్రమే ఇవన్నీ రాజకీయ పార్టీల ముసుగును తొడుక్కున్నట్లు ఈసీ అనుమానిస్తోంది. గుర్తింపు పొందని అనేక పార్టీలు... నగడు అక్రమ చలామణి కార్యకలాపాలను చేపడుతున్నాయని భావిస్తోంది.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో 2010 నాటికి దేశంలో 1,112 పార్టీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 2,700 దాటిపోయింది. జాతీయ పార్టీలు ఏడు కాగా రాష్ట్రస్థాయి పార్టీలు 50కి వైగా ఉన్నాయి. మిగిలినవి గుర్తింప్తు పొందని పార్టీలే. మొత్తంమీద సుమారు 450 పార్టీలే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మిగిలిన 2,250 పార్టీలు గత కొన్నేళ్లుగా ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఒకదశలో 200కి పైగా పార్టీలను ఈసీ పక్కనపెట్టింది. ప్రస్తుత చట్టం ప్రకారం రాజకీయ పార్టీల నమోదుకు మాత్రమే ఈసీకి అధికారం ఉంది. నమోదును రద్దు చేసే అధికారం లేదు. 'విరాళాలు వసూలు చేయాలంటే ఆయా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తుండాలనే నిబంధన ఏదీ ప్రజా ప్రాతినిధ్య చట్టం-1851లో లేదు.

ఇదీ చూడండి :గుంతలు తవ్వి.. 150 వీధి శునకాలను సజీవంగా పూడ్చి!

ABOUT THE AUTHOR

...view details