తెలంగాణ

telangana

ప్రొఫెసర్​ దంపతుల దారుణ హత్య.. ఇంటి నిండా రక్తపు మరకలు

By

Published : Jan 31, 2023, 11:30 AM IST

రిటైర్డ్ ప్రొఫెసర్​ దంపతులను కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతదేహాలపై గాయాలు, ఎండిన రక్తపు మరకలు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఈ దారుణం బిహార్​లో వెలుగుచూసింది. మరోవైపు, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

double murder in arrah retired professor couple killed
double murder in arrah retired professor couple killed

బిహార్​లో దారుణం జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్​ దంపతులను కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంట్లోకి చొరబడి మరీ చంపినట్లు తెలుస్తోంది. కాగా, ఈ జంట హత్యలు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రొఫెసర్​ మహేంద్ర సింగ్ (70)​ ..వీర్​ కున్​వర్ సింగ్​ యూనివర్సిటీ డీన్​గా పనిచేసి రిటైర్డ్​ అయ్యారు. ఆయన భార్య పుష్ప సింగ్​ (65) మహిళ కాలేజీలో ప్రొఫెసర్​గా చేసి పదవీ విరమణ తీసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ దంపతులిద్దరూ నవాడా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కటిరా ప్రాంతంలో ఓ ఫ్లాట్​లో నివాసం ఉంటున్నారు. అయితే, సోమవారం ఉదయం నుంచి లఖ్​నవూలో ఉంటున్న వీరి కుమార్తె.. తన తండ్రికి ఫోన్ చేస్తున్నా.. లిఫ్ట్​ చేయలేదు. దీంతో ఆమె తన ఫ్రెండ్​కు ఫోన్​ చేసింది. అనంతరం ఆమె ఫ్రెండ్​ ఇంటికి వెళ్లి చూడగా.. ఈ జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి. కాగా, సోమవారం మహేంద్ర సింగ్​ మృతదేహం డైనింగ్​ రూంలో పడి ఉంది. అతడి భార్య పుష్ప సింగ్ మృదేహం బెడ్​రూం ఉంది. వారి మృతదేహాలపై గాయాలు.. రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే భోజ్​పుర్​ ఏస్పీ ప్రమోద్​ కుమార్​ యాదవ్, ఏఎస్పీ హిమాన్షు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గురైన ప్రొఫెసర్​ దంపతులు

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్​​ డెడ్..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ముంబయి-అహ్మదాబాద్​ జాతీయ రహదారిలోని మహాలక్ష్మి బ్రిడ్జ్​ సమీపంలో జరిగింది.

ఇదీ జరిగింది
అహ్మదాబాద్​ నుంచి ఓ కారు ముంబయి వైపు వస్తోంది. ఉదయం మూడున్నర గంటల సమయంలో డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్ల ముందుగా వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు కాసా పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన బస్సు
నుజ్జునుజ్జైన కారు

ABOUT THE AUTHOR

...view details