తెలంగాణ

telangana

స్పేస్​లో చికెన్ బిర్యానీ, సాంబార్​ రైస్- 'గగన్​యాన్'​ కోసం మీల్స్​ రెడీ!

By

Published : Dec 14, 2021, 3:41 PM IST

dfrl mysore gaganyaan mission
అంతరిక్షంలో భారత వ్యోమగాములకు చికెన్​ బిర్యాని- వెజ్​ రోల్​!

Food for Gaganyaan astronauts: దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న గగన్​యాన్​ మిషన్​ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వ్యోమగాములు శిక్షణలో మునిగిపోయారు. మరి వారికి 'ఫుడ్​' ఎలా.. అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా?

Food for Gaganyaan astronauts: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చెపట్టిన ప్రాజెక్ట్​ 'గగన్​యాన్​'. ఇందుకోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వ్యోమగాములకు అన్ని విధాలుగా శిక్షణనిస్తున్నారు. తాజాగా.. వ్యోమగాములు సేవించే ఆహారపదార్థాల తయారీ ప్రారంభమైంది.

కర్ణాటక మైసూర్​లోని డీఆర్​డీఓకు చెందిన డీఎఫ్​ఆర్​ఎల్​(డిఫెన్స్​ ఫుడ్​ రీసెర్చ్​ లెబోరేటరీ) ఈ ఫుడ్​ను తయారు చేస్తోంది. ఈ సందర్భంగా.. డీఎఫ్​ఆర్​ఎల్​ శాస్త్రవేత్త మధుకర్​.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

"భూమి మీద అయితే కూర్చుని, నిల్చుని మనం భోజనం చేసేందుకు వీలు ఉంటుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ మన చపాతీలు, కూరలు అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. అందువల్ల వ్యోమగాములకు ప్రత్యేక ఆహారం రూపొందించాల్సి ఉంటుంది. దానిపై మేము పనిచేస్తున్నాము. ఆహారపదార్థాల జాబితాను సిద్ధం చేసి.. వాటిని పరీక్షిస్తున్నాము. గగన్​యాన్​లో రోదసిలోకి వెళుతున్న ముగ్గురు వ్యోమగాములు భారతీయులే. అందువల్ల భారతీయ వంటకాలనే ఎంపిక చేశాము. రెడీ టు ఈట్​ వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నాము. వ్యోమగాములకు ఆహారాన్ని అందించేందుకు ఓ లిక్విడ్​ డెలివరీ సిస్టమ్​ను ఏర్పాటు చేశాము. క్రిములు ప్రవేశించలేని ప్రపంచస్థాయి వంటశాల మన దగ్గర ఉంది. ఇక్కడే ఫుడ్​ తయారు చేస్తాము. అంతరిక్షంలోకి వెళ్లాక.. వ్యోమగాములు వాటిని తినొచ్చు. ముందు.. వీటిని ఇస్రోకు పంపిస్తాము. అక్కడి నుంచి వచ్చే ఫీడ్​బ్యాక్​తో.. ఆహారపదార్థాల తుది జాబితాను సిద్ధం చేస్తాము."

--- మధుకర్​, డీఎఫ్​ఆర్​ఎల్​ శాస్త్రవేత్త.

స్పేస్​ ఫుడ్​ మెన్యూ ఇదే..

రెడీ టు ఈట్​:-

  • వెజ్​ పులావ్​
  • వెజ్​ బిర్యానీ
  • చికెన్​ బిర్యానీ
  • చికెన్​ కూర్మ
  • దాల్​ మఖ్కని
  • షాహీ పనీర్​
  • సూజి హల్వా
  • చికెన్​ కట్టి రోల్​
  • వెజ్​ కట్టి రోల్​
  • ఎగ్​ కట్టి రోల్​
  • స్టఫ్డ్ పరోటా

రెడీ టు డ్రింక్​:-

  • మ్యాంగో నెక్టర్​
  • పైనాపిల్​ జూస్​
  • టీ
  • కాఫీ
    ఆహారపదార్థాలు..

కాంబో ఫుడ్​:-

  • రాజ్మా చావల్​
  • సాంబార్​ చావల్​
  • దాల్​ చావల్​
  • రెడీ టు ఈట్​ ఎనర్జీ బార్స్​

Gaganyaan astronauts training: గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో.. జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే తెలిపారు. గగన్​యాన్​కు ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ కోసం రష్యాలోని గ్లావ్కోస్మోస్​ సర్వీస్ ప్రొవైడర్​తో 2019 జూన్​లో ఇస్రో ఒప్పందం చేసుకుంది. భారతీయ వాయుసేనకు చెందిన పైలట్లను ఇందుకోసం రష్యాకు పంపించింది. 2020 ఫిబ్రవరి 10న శిక్షణ ప్రారంభం కాగా.. కరోనా కారణంగా ట్రైనింగ్​కు మధ్యలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చ్​లో శిక్షణ ముగించుకుని వారు స్వదేశానికి తిరిగొచ్చారు.

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను తిరిగి భూమిపై ఎక్కడ ల్యాండింగ్‌ చేయాలనేదానిపై ఇస్రో శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చి గుజరాత్‌లోని వెరావల్‌ తీరాన్ని ప్రాథమికంగా ఎంచుకున్నారు. ఒకవేళ అక్కడ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయంగా బంగాళాఖాతంలోని మరో తీరాన్ని ఎంపికచేశారు. కచ్చితంగా ఎక్కడ ల్యాండింగ్‌ చేస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ల్యాండ్‌ అయిన 15-20 నిమిషాలలోపు వ్యోమగాములను క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకెళ్తారు. అక్కడ వారి ఆరోగ్య వివరాలు పరిశీలించి, అంతా బాగుందనుకున్న తర్వాతే ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details