ETV Bharat / bharat

గగన్​యాన్​ వ్యోమగాముల ల్యాండింగ్​ అక్కడేనా!

author img

By

Published : Feb 8, 2021, 5:56 AM IST

Isro plans to land Gaganyaan astronauts in Gujarat!
గగన్​యాన్​ వ్యోమగాముల ల్యాండింగ్​ అక్కడేనా!

వచ్చే ఏడాది మానవసహిత గగన్​యాన్​ ప్రయోగానికి ఇస్రో కసరత్తు ముమ్మరం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను తిరిగి భూమిపై ఎక్కడ ల్యాండింగ్‌ చేయాలన్న ప్రతిపాదనపై ఇస్రో శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చారు. ఇందుకోసం గుజరాత్​లోని వెరావల్​ తీరాన్ని ఎంచుకున్నారు.

ఈ ఏడాది చివర్లో మానవరహిత గగన్‌యాన్‌ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మనిషినీ అంతరిక్షంలోకి పంపేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను తిరిగి భూమిపై ఎక్కడ ల్యాండింగ్‌ చేయాలన్న ప్రతిపాదనపై ఇస్రో శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చి గుజరాత్‌లోని వెరావల్‌ తీరాన్ని ప్రాథమికంగా ఎంచుకున్నారు.

ఒకవేళ అక్కడ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయంగా బంగాళాఖాతంలోని మరో తీరాన్ని ఎంపికచేశారు. కచ్చితంగా ఎక్కడ ల్యాండింగ్‌ చేస్తారన్న విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ల్యాండ్‌ అయిన 15-20 నిమిషాలలోపు వ్యోమగాములను క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకెళ్తారు. అక్కడ వారి ఆరోగ్య వివరాలు పరిశీలించి, అంతా బాగుందనుకున్న తర్వాతే ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి:- గగన్​యాన్​ 'ఫ్లైట్ సర్జన్ల'కు రష్యాలో శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.