తెలంగాణ

telangana

దళిత బాలుడికి మూత్రం తాగించి దాడి- కనుబొమ్మలు పీకేసి దారుణం

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 6:19 PM IST

Updated : Nov 25, 2023, 7:51 PM IST

Dalit Teenager Beaten Drink Urine : ఓ దళిత బాలుడిపై దారుణంగా దాడి చేశారు కొందరు యువకులు. అతడికి మూత్రం తాగించి, కనుబొమ్మలు పీకేసి, నోట్లో బురద కుక్కి కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని జౌన్​పుర్​లో జరిగింది.

Dalit Teenager Beaten Drink Urine
Dalit Teenager Beaten Drink Urine

Dalit Teenager Beaten Drink Urine :బాలికను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ దళిత బాలుడిపై క్రూరంగా దాడి చేశారు కొందరు యువకులు. అతడికి మూత్రం తాగించి, కనుబొమ్మలు పీకేసి, నోట్లో బురద కుక్కి కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని జౌన్​పుర్​లో జరిగింది. సుజన్​గంజ్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇరుపక్షాలు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది
ఓ బాలిక తాను కళాశాలకు వెళ్తుండగా.. కొందరు వేధిస్తున్నారని ఇంట్లో వాళ్లకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆ బాలుడిని ఖుతహాని గ్రామంలోని పెట్రోల్​ బంక్ వద్ద పట్టుకుని దారుణంగా కొట్టారు. అతడిని బురదలో పడేసి కొడుతూ.. నోట్లో మట్టి కుక్కారు. అంతటితో ఆగకుండా మూత్రాన్ని తాగించారు. ఆ తర్వాత అతడి కనుబొమ్మలు సైతం పీకేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాలుడి తండ్రిని సైతం కొట్టారు. అనంతరం ఇరుపక్షాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన బిహార్​ బెతియా జిల్లాలో జరిగింది. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

నౌతన్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఛఠ్​ పూజ సందర్భంగా తల్లితో కలిసి తాత ఇంటికి వచ్చింది చిన్నారి. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పక్కింటి యువకుడు మనీశ్​ కుమార్.. చిన్నారిని ఆడిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు.. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. "రెండేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది" అని డీఎస్పీ మహ్తాబ్​ ఆలమ్ తెలిపారు.

రూ.350 కోసం యువకుడి హత్య- శవం ముందు డ్యాన్స్ చేసి 16 ఏళ్ల బాలుడి పైశాచికానందం

భర్త బ్రెయిన్ ​డెడ్​- అవయవదానం చేసి మంచి మనసు చాటుకున్న భార్య, నలుగురి ప్రాణాలు సేఫ్​!

Last Updated : Nov 25, 2023, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details