ETV Bharat / bharat

భర్త బ్రెయిన్ ​డెడ్​- అవయవదానం చేసి మంచి మనసు చాటుకున్న భార్య, నలుగురి ప్రాణాలు సేఫ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 3:34 PM IST

Brain Dead Person Organs Donation : తమిళనాడుకు చెందిన ఓ మహిళ తన మానవత్వాన్ని చాటుకుంది. బ్రెయిన్ డెడ్​ అయిన తన భర్త అవయవాలను దానం చేశారు. దీంతో ఆపదలో ఉన్న నలుగురు వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపారు.

Brain Dead Person Organs Donation
Brain Dead Person Organs Donation

Brain Dead Person Organs Donation : బ్రెయిన్​ డెడ్​కు గురైన భర్త అవయవాలు దానం చేసి తన పెద్దమనసును చాటుకున్నారు తమిళనాడుకు చెందిన ఓ మహిళ. 36 ఏళ్ల తన భర్త అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసి నలుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడారు.

ఇదీ విషయం..
కన్యాకుమారి జిల్లా విలవంకోడ్​కు చెందిన సెల్విన్ శేఖర్ ఓ అసుపత్రిలో స్టాఫ్ నర్స్​గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా స్టాఫ్ నర్స్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, నవంబర్ 21న సెల్విన్ శేఖర్​ భరించలేని తలనొప్పితో బాధపడుతూ కన్యాకుమారిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అతడిని పరిశీలించిన వైద్యులు.. మెదడులో రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం కేరళ తిరువనంతపురంలోని కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 24న బ్రెయిన్​డెడ్​​కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. వృత్తిరీత్యా నర్స్​ అయిన అతడి భార్య.. అవయవదానానికి స్వచ్చందంగా ముందుకు వచ్చింది.

Brain Dead Person Organs Donation
హెలికాఫ్టర్​లో మృతదేహం తరలింపు

మృతుడి భార్య అంగీకారం అనంతరం అతడి అవయవాలను తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. కొచ్చిలో గుండెమార్పిడి అవసరమైన రోగి కోసం హృదయాన్ని తరలించేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గుండెను తరలించడానికి మంత్రి పి.రాజీవ్​ను సంప్రదించి ప్రభుత్వ హెలికాఫ్టర్​ను తీసుకుని తిరువనంతపురం నుంచి కొచ్చికి సెల్విన్ గుండెను ఎయిర్ అంబులెన్సులో తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్ హెలీప్యాడ్​లో దిగిన వెంటనే.. లీసీ అసుపత్రిలో చికిత్స పొందుతున్న కాయంకులానికి చెందిన హరినారాయణ్(16)కు సెల్విన్ గుండెను అమర్చారు. సెల్విన్ శరీరంలోని ఓ కిడ్నీని తిరువనంతపురంలోని ఓ రోగికి అమర్చనున్నారు. సెల్విన్​ నేత్రాలను తిరువనంతపురం కంటి ఆసుపత్రికి చెందిన ఇద్దరు రోగులకు అమర్చనున్నారు.

Brain Dead Person Organs Donation
మృతుడు సెల్విన్ శేఖర్( పాత చిత్రం)

ఆరేళ్ల ప్రాణదాత... తాను చనిపోయి.. ఐదుగురికి ప్రాణం పోసి..
6 year old girl organ donation: గతేడాది ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాకు చెందిన ఆరేళ్ల బాలిక ఐదుగురికి ప్రాణదానం చేసింది. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్​డెడ్ అయిన ఆమె అవయవాలను దానం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయం.. ఐదు జీవితాలను నిలబెట్టింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

రెండేళ్ల బాలిక బ్రెయిన్​ డెడ్- అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ

100 Times Blood Donor : 100సార్లు రక్తదానం.. 'బ్లడ్​ ఫైటర్స్'​ కేర్ ప్రారంభం.. ఎందరికో ఆదర్శంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.