తెలంగాణ

telangana

మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. భారతీయుల రాకపై నేపాల్ నిషేధం

By

Published : Aug 10, 2022, 9:14 AM IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 16,047 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో మంది కరోనా నుంచి కోలుకున్నారు.

covid-cases in india today
covid-cases in india today

Covid Cases in India: దేశంలో కొవిడ్‌ 19 కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా (మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు) 16,047 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 12,751గా నమోదైంది. మరోవైపు, కరోనాతో పోరాడుతూ 54 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 4.94 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 19,539 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.52 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.29 శాతానికి పడిపోయాయి.

  • మొత్తం కేసులు: 4,41,90,697
  • మరణాలు:
  • క్రియాశీల కేసులు: 1,28,261
  • కోలుకున్నవారు: 4,35,35,610

Vaccination India:
భారత్​లో మంగళవారం 15,21,429 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 207.03 కోట్లు దాటింది. మరో 3,25,081 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 7,69,711 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,060 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,09,91,820కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,41,530 మంది మరణించారు. ఒక్కరోజే 10,41,580 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,27,68,702కు చేరింది.

  • జపాన్​లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 1,72,998 కేసులు నమోదయ్యాయి. 162 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 1,49,819 కేసులు వెలుగులోకి వచ్చాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 72,737 కరోనా కేసులు నమోదయ్యాయి. 213 చనిపోయారు.
  • అమెరికాలో 58,223 కేసులు బయటపడ్డాయి. 342 మంది మరణించారు.

భారత పర్యటకులపై నేపాల్‌ నిషేధం
కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే పర్యటకులపై నేపాల్‌ నిషేధం విధించింది. ఇలా వచ్చిన నలుగురు భారతీయులకు కొవిడ్‌ నిర్ధరణ కాగా వారిని వెనక్కి పంపిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురూ ఝులాఘాట్‌ సరిహద్దు ప్రాంతం గుండా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించారు. వారికి పాజిటివ్‌గా తేలినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

భారతీయులకు కొవిడ్‌ పరీక్షలు కూడా పెంచినట్లు చెప్పారు. భారత్‌ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్‌ బారినపడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు నేపాల్‌లోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు చెప్పారు. నేపాల్‌లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం 1,090 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 6 నెలల్లో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

త్వరలోనే చైనాకు భారతీయ విద్యార్థులు!
చైనాలో చదువుకుంటూ కొవిడ్‌ కారణంగా స్వస్థలాలకే పరిమితమైన వేలాది మంది భారతీయ విద్యార్థులకు డ్రాగన్‌ ఆశావహమైన కబురు చెప్పింది. భారత్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను తిరిగి రప్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈమేరకు సమీప భవిష్యత్తులోనే తొలి బ్యాచ్‌ భారతీయ విద్యార్థులు చేరుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయమై చర్యలు ముమ్మరం చేసినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకరులకు తెలిపారు. విద్యార్థులను దశలవారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

చైనాలో చదువుకుంటున్న 23 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు కొవిడ్‌ వీసా నిబంధనల కారణంగా స్వస్థలాల్లో ఉండిపోయారు. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. ఈ నేపథ్యంలో చదువుల కోసం తక్షణం తిరిగి రావాలని ఆశిస్తున్న విద్యార్థుల పేర్లను చైనా అడగగా.. వందల మందితో జాబితాను భారత్‌ పంపించింది. వీరికి సంబంధించి తిరిగిరప్పించే ప్రక్రియ ఏ దశలో ఉందని విలేకరులు అడగ్గా.. "ఓపిగ్గా వ్యవహరించండి. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం" అని వెన్‌బిన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details