తెలంగాణ

telangana

Covid cases in India: దేశంలో మరో 18వేల మందికి కరోనా

By

Published : Oct 11, 2021, 9:29 AM IST

Covid cases in India

దేశంలో కొత్తగా 18,132 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 193 మంది మృతి చెందారు. మరో 21వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనా(Coronavirus update) వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 18,132 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 21,563 మంది కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు:33,912,444
  • మొత్తం మరణాలు:4,50,782
  • మొత్తం కోలుకున్నవారు:3,32,93,478
  • యాక్టివ్ కేసులు:2,27,347

పరీక్షలు

ఆదివారం ఒక్కరోజే 10,35,797 కొవిడ్​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

వ్యాక్సినేషన్​..

ఆదివారం కొత్తగా 46,57,679 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 95,19,84,373కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా మందికి 3,01,587 కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 4,595 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,86,32,258కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,67,010కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా- 24,694
  • బ్రిటన్- 34,574
  • టర్కీ- 28,370
  • రష్యా- 28,647
  • బ్రెజిల్- 8,639
  • ఇరాన్- 11,256

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details