తెలంగాణ

telangana

దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు

By

Published : Mar 18, 2022, 9:23 AM IST

Corona Cases: భారత్​లో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,528 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 149 మంది మరణించారు. కొత్తగా 3,997 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

corona cases in india
corona cases in india

Covid Cases In India: భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసులు స్థిరంగా నమోదవుతున్నా. కొత్తగా 2,528 మందికి వైరస్​ సోకింది. అయితే మరణాలు మాత్రం క్రితం రోజుతో(60) పోల్చితే భారీగా పెరిగాయి. కొత్తగా మరో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,997 వైరస్​ను జయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.40శాతం ఉంది.

  • మొత్తం కేసులు: 4,30,04,005
  • మొత్తం మరణాలు: 5,16,281
  • యాక్టివ్​ కేసులు: 29,181
  • కోలుకున్నవారు: 4,24,58,543

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గురువారం మరో 15,77,783 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,97,94,588కు పెరిగింది.

Covid Tests:

దేశంలో గురువారం 6,33,867 కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇదీ చదవండి:నాగు పాములతో యువకుడి ఆటలు.. అంతలోనే..!

ABOUT THE AUTHOR

...view details