తెలంగాణ

telangana

దారుణం.. 20 ఏళ్ల యువతిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

By

Published : Feb 25, 2022, 7:55 AM IST

Baghpat news: 20 ఏళ్ల యువతిని గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఆమె పెళ్లికి నిరాకరించిందని ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

college-woman-hacked-to-death-by-jilted-lover-in-ups-baghpat
దారుణం.. 20 ఏళ్ల యువతిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

college woman hacked to death: ఉత్తర్​ప్రదేశ్ బాగ్​పత్​లో ఓ ప్రేమోన్మాది ఘూతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో 20 ఏళ్ల యువతికి గోంతుకోసి హత్య చేశాడు. ఆమె మార్కెట్​కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా అదను చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనలో నిందితుడి పేరు రింకు కాగా.. మృతిచెందిన యువతి పేరు దీప. డిగ్రీ చదువుతోంది.

ఈ యువతి పట్ల 8 ఏళ్లుగా తాను ఆకర్షితుడిని అయ్యానని పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయిన అనంతరం రింకు తెలిపాడు. హత్యకు ఉపయోగించిన పదునైన కత్తిని కూడా పోలీసులకు సమర్పించాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తన కూతురు ఇంటికి తిరిగివస్తుండగా గురుద్వారా కాలనీలో రింకు కత్తితో దాడి చేశాడని మృతురాలి తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించదని చెప్పాడు. తమ అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయాలని, లేకపోతే చంపేస్తానని మంగళవారమే రింకు బెదిరించాడని తెలిపాడు. అందుకు తాము నిరాకరించినందు వల్లే గురువారం ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:పెళ్లి కాలేదని వెళితే.. తల్లీకూతుళ్లపై రెండేళ్లుగా బాబా అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details