తెలంగాణ

telangana

ఒకే ఇంట్లో 15 నాగుపాములు.. తీస్తున్న కొద్దీ బయటకు వస్తూనే..

By

Published : Jul 27, 2023, 11:02 AM IST

Cobra Snake Found In India : ఒకే ఇంట్లో 15 పైగా నాగు పాములు కనిపించాయి. ఈ పాములు 4-5 రోజుల వ్యవధిలో వరుసగా బయటపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు.

Cobra Snake Found In India
Cobra Snake Found In India

ఒకే ఇంట్లో 15 నాగు పాములు కలకలం

Cobra Snake Found In India : బిహార్​లోని సీతామఢీ జిల్లా​లో ఒకే ఇంట్లో 15 పాములు కనిపించడం కలకలం రేపింది. దుమ్రా మండలం మురద్​పుర్​ గ్రామంలోని ఓ ఇంట్లో పాములు బయటపడ్డాయి. దీనిపై అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగింది..
సీతామఢీ జిల్లాలో మురద్​పుర్​ గ్రామంలోని ఓ ఇంట్లో ఒక వృద్ధ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. వారి కుమారుడు ఒడిశాలో ఉంటున్నాడు. అయితే, వృద్ధ మహిళ నివసిస్తున్న ఇంటి బాత్​​రూం ట్యాంక్​ నుంచి 4-5 రోజుల వ్యవధిలో వరుసగా 15 నాగు పాములు బయట పడ్డాయి. ఇలా నాగుపాములు బయటపడుతుండటం వల్ల.. చుట్టపక్కల ఇళ్ల వాళ్లు కూడా భయందోళనలకు గురయ్యారని ఆ వృద్ధ మహిళ తెలిపింది. రాత్రంతా భయంతో జాగారం చేయాల్సివస్తోందని వాపోయింది.

అయితే ఈ విషయాన్ని ఆ వృద్ధ మహిళ.. తన కుమారుడికి తెలియజేసింది. దీంతో అతడు ఆన్​లైన్​లో అధికారులకు సమాచారమిచ్చాడు. ఆ పాముల బెడద నుంచి తన తల్లిదండ్రులను రక్షించాలని కోరాడు. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. కాగా ప్రస్తుతానికి ట్యాంక్​ రంధ్రాన్ని గుడ్డలతో మూసివేశారు.

'గత 4, 5 రోజులుగా ఇంటి నుంచి 15 పాములు బయటికి వచ్చాయి. సమాచారం ఇచ్చినా పాముల సంరక్షణ బృందాలు రాలేదు. భయంతో వంటగదిలో ఆహారం వండేందుకు వెళ్లడం లేదు. పాములున్నాయనే భయంతో చుట్టుపక్కల వాళ్లు కూడా సాయం చేయడం లేదు' అని బాధితురాలు మిథ్లేషి శర్మ ఆవేదన వ్యక్తం చేసింది.

ఒకే ఇంట్లో 60 పాములు..
Snake rescue video bihar : ఇటీవలే ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. బిహార్​లోని రోహ్తాస్​లో ఒకే ఇంట్లో 50- 60 పాములు కనిపించడం కలకలం రేపింది. ఒకే దగ్గర అన్ని పాములు చూసి అటవీ శాఖ అధికారులే షాక్ అయ్యారు. సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగ్​రోఢ్ ఖుర్ద్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ పాములు కనిపించాయి. ఆందోళనకు గురైన ఆ ఇంటి వారు.. పక్కింటి వారిని పిలిచి కొన్ని పాములను కొట్టి చంపేశారు. కొద్దిసేపటికి మరికొన్ని పాములు బయటకు రావడం మొదలైంది. వచ్చిన పాములను వచ్చినట్టే చంపేశారు. ఇలా రెండు డజన్ల సర్పాలను చంపారు. అయినప్పటికీ మరిన్ని పాములు బయటపడటం వల్ల.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ పాముల వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details