ఇంటి వెనుక 25 తాచు పాములు.. పడగలు విప్పి, బుసలు కొడుతూ..

By

Published : Jun 11, 2023, 1:05 PM IST

Updated : Jun 11, 2023, 1:38 PM IST

thumbnail

కర్ణాటక, ధార్వాడ్​ జిల్లాలోని ఓ ఇంటి పెరట్లో 25పైగా తాచు పాములు బయటపడ్డాయి. ఒకేచోట అన్ని పాముల్ని చూసిన స్థానికులు.. ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఆ పాములన్నింటినీ పట్టుకున్న స్నేక్​ క్యాచర్..​ అనంతరం వాటిని స్థానిక అడవుల్లో విడిచిపెట్టాడు.

కొంతకాలంగా ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న పాము..
బసవరాజ్ కట్టిమాని.. కుందగోళ నియోజకవర్గ పరిధిలోని హిరేహరకుని గ్రామానికి చెందిన వ్యక్తి. కొంత కాలంగా ఓ తాచు పాము బసవరాజ్ ఇంటి పరిసరాల్లో సంచరిస్తోంది. దీన్ని గమనించిన అతడు.. స్నేక్​ క్యాచర్​కు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్​ క్యాచర్​.. తాచు పామును పట్టుకున్నాడు. తరువాత దాన్ని పట్టుకున్న స్థలంలోనే.. స్థానికుల సాయంతో ఓ గొయ్యి తవ్వాడు. అనంతరం ఆ రంధ్రంలోంచి బుల్లి తాచు పాము పిల్లలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. పడగలు విప్పి, బుసలు కొడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాకచక్యంగా పాముల్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వాటిని ఓ డబ్బాలో భద్రపరిచాడు. అనంతరం జాగ్రత్తగా స్థానిక అడవిలో విడిచిపెట్టాడు. పాములను చంపవద్దని.. కనిపిస్తే తమకు సమాచారం అందిచాలని స్నేక్​ క్యాచర్​.. స్థానికులకు సూచించారు. 

లక్కీ గర్ల్.. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి..
కొద్ది రోజలు క్రితం కర్ణాటక బెళగావి జిల్లాలోని హలగా గ్రామంలో ఓ బాలిక అదృష్టవశాత్తు నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఇంటి గుమ్మం వద్ద బుసలు కొడుతూ ఉన్న ఓ పామును గమనించకుండా అలాగే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కరిచేందుకు చూసింది. అయితే కొన్ని క్షణాలు గుమ్మం డోర్​ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడం వల్ల ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. క్షణాల్లోనే ప్రాణాపాయం నుంచి బయటపడింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Jun 11, 2023, 1:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.