తెలంగాణ

telangana

నిజాయతీ, పారదర్శక పాలన అందిస్తా: స్టాలిన్​

By

Published : May 9, 2021, 9:30 PM IST

తమిళనాడును 'ఉత్తమ రాష్ట్రం'గా తీర్చిదిద్దాలన్నదే తన కల అని ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో పారదర్శకత, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు.

CM Stalin
ఎంకే స్టాలిన్

తమిళనాడులో పారదర్శకత, నిజాయతీతో కూడిన పాలనను అందిస్తానని ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. ప్రజల కోసమే ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. తమిళనాడును 'ఉత్తమ రాష్ట్రం'గా తీర్చిదిద్దాలన్నదే తన కల అన్నారు. ఈ మేరకు పార్టీ కేడర్​కు లేఖ రాశారు స్టాలిన్.

" ప్రభుత్వాన్ని నా నాయకత్వంతో నడిపినా.. నేను డీఎంకే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా.. ఇది పార్టీ ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ప్రజలందరిది. ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారిని ప్రభుత్వం ఒకే విధంగా చూస్తుంది. రాష్ట్రంలో పారదర్శకత, నిజాయతీతో కూడిన పాలనను అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నా. "

-- ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు స్టాలిన్. మిగతా పార్టీ వారితోనూ స్నేహభావంతో వ్యవహరించాలన్నారు.

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయదుందుబి మోగించింది. మే 7న ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఇదీ చదవండి :ఆ రాష్ట్రంలో వీధి శునకాల సంరక్షణకు ప్రత్యేక నిధి

ABOUT THE AUTHOR

...view details