తెలంగాణ

telangana

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌- ఆరుగురికి గాయాలు

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 9:53 AM IST

Updated : Jan 10, 2024, 7:37 PM IST

Charminar Express Derailed at Nampally : హైదరాబాద్‌ నాంపల్లి స్టేషన్‌లో స్వల్ప రైలు ప్రమాదం జరిగింది. చెన్నె నుంచి వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌, ఐదో ప్లాట్‌ఫాం వద్ద డెడ్‌ ఎండ్‌ గోడను ఢీకొట్టింది. స్టేషన్‌లో ఆగేందుకు నెమ్మదిగా వస్తున్న క్రమంలోనే గోడను ఢీకొట్టడంతో పెద్దగా నష్టం జరగలేదు. ఈ ఘటనలో 3 బోగీలు పాక్షికంగా దెబ్బతినగా, ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.

Charminar Express derailed at Nampally
Charminar Express derailed

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌- 10 మందికి గాయాలు

Charminar Express Derailed at Nampally : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెనుప్రమాదం తప్పింది. ఈ ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్‌ వచ్చిన చార్మినార్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోనే చాలా వరకు ప్రయాణికులు దిగిపోగా, మిగిలిన వారితో చివరి స్టేషన్ అయిన నాంపల్లికి వచ్చింది. స్టేషన్‌లో ఐదో ప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు, ఆగే సమయంలో అక్కడి డెడ్‌ ఎండ్‌ వాల్‌ను ఢీకొట్టింది.

Train Accident at Nampally Hyderabad :ఈ క్రమంలో ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా, మూడు బోగీలు ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 పట్టాలు తప్పి పాక్షికంగా దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్‌లోనే ప్రయాణికులు చాలా వరకు దిగిపోగా, మిగిలిన వారు నాంపల్లిలో దిగేందుకు డోర్‌ల వద్దకు చేరుకుంటుండగానే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని లాలాగుడాలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా కూడా అందించినట్లు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రుల బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు నాంపల్లి స్టేషన్​కు చేరుకుని విచారణ చేపట్టారు. ఓవర్ స్పీడ్​తో డెడ్ ఎండ్​ను ఢీకొట్టడం వల్ల ఈప్రమాదం జరిగిందని రైల్వే సీపీఆర్వో రాకేశ్​ తెలిపారు.

'చెన్నై నుంచి వస్తున్న చార్మినార్ ఎక్స్​ప్రెస్​కి​ నాంపల్లి స్టేషన్​ చివరిది. చివరి స్టాప్ కొంచెం స్పీడ్​లో ఉండడంతో వాల్​ను ఢీ కొనడం జరిగింది. దీంతో ఎస్​2, ఎస్​3, ఎస్​6 మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఈ ట్రైన్​ వాకింగ్​ స్పీడ్​లో ఉండడంతో దాని ప్రభావం అంతగా లేదు. చివరి స్టేషన్​ కావడంతో దిగుదామని ప్రయాణికులు తలుపు దగ్గర ఉండడంతో వారికి కొంచెం గాయాలయ్యాయి. ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారికి మా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నాం. మిగతా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు.' -రాకేశ్, రైల్వే సీపీఆర్వో

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌- ఆరుగురికి గాయాలు

పట్టాలు తప్పిన గూడ్స్​ ట్రైన్​.. 8 రైళ్లు రద్దు.. సహాయక చర్యలు ముమ్మరం

Minister Ponnam on Charminar Express Train Accident : చార్మినార్ ఎక్స్​ప్రెస్‌ పట్టాలు తప్పడంపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. రైలు సైడ్‌ వాల్‌ను తాకి పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్చలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు- పట్టాలు తప్పిన గూడ్స్

Train Derailed In UP : పట్టాలు తప్పిన సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​​.. అంతా సేఫ్​.. కానీ!

Last Updated : Jan 10, 2024, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details