తెలంగాణ

telangana

'కొవిడ్​ ఆంక్షలు సడలించండి'- రాష్ట్రాలకు కేంద్రం సూచన

By

Published : Feb 25, 2022, 10:51 PM IST

Covid Restrictions: కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రి కర్ఫ్యూ రద్దు సహా పలు ఆంక్షలను సడలిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. బిహార్​ కూడా పలు ఆంక్షలను సవరించింది.

covid news
కరోనా ఆంక్షలు

Covid Restrictions: దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను సడలించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. సామాజిక, క్రీడ, వినోదం, ఆధ్యాత్మిక, విద్యా రంగాలకు సంబంధించిన కార్యకలాపాలపై ఆంక్షలు సహా రాత్రి కర్ఫ్యూలను రద్దు చేయాలని పేర్కొంది. కొవిడ్​ తీవ్రతను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

రవాణా, సినిమా హాళ్లు, జిమ్​, స్పా, బార్లు, రెస్టారెంట్లు సహా ఇతర వాణిజ్య కేంద్రాలపై ఆంక్షలను సవరించవచ్చని కేంద్రం తెలిపింది.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్​ నిబంధనలను కొనసాగించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిపై సంబంధిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

దిల్లీలో సడలింపు..

మహమ్మారిని కట్టడి చేసిన దిల్లీ ప్రభుత్వం.. ఆంక్షలను సడలిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాత్రి కర్ఫ్యూను రద్దు చేయడం సహా ఆఫ్​లైన్ తరగతులను ఏప్రిల్​ 1 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్​ కెజ్రీవాల్ స్పష్టం చేశారు​. మాస్కులు ధరించని వారిపై విధించే చలానాను రూ.2000 నుంచి రూ.500కు తగ్గిస్తున్నట్లు తెలిపారు.

ఝార్ఖండ్​లో కూడా..

ఝార్ఖండ్​లోనూ కొవిడ్​ ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాఠశాలల్లో ఆఫ్​లైన్​ తరగతులకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వెల్లడించారు. పార్క్​లు, టూరిస్ట్​ స్పాట్లు, స్విమ్మింగ్​ పూల్స్​కు అనుమతి సహా మార్కెట్లపై విధించిన ఆంక్షలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లు, బార్లు కూడా 100 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించడంపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :ఉక్రెయిన్​లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు- ఫ్రీగా...

ABOUT THE AUTHOR

...view details