తెలంగాణ

telangana

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్.. ఏం జరిగింది?​

By

Published : Jan 4, 2023, 10:56 PM IST

Updated : Jan 5, 2023, 8:29 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానం అత్యవసర పరిస్థితుల్లో అసోంలో ల్యాండ్ అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Amit Shah suddenly arrives in Guwahati
అమిత్​ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానం అత్యవసర పరిస్థితుల్లో అసోంలో ల్యాండ్ అయింది. అగర్తలకు వెళ్తుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం రాత్రి అత్యవసర ల్యాండింగ్​​ కారణంగా ఆయన గువహటిలోనే బసచేయనున్నారు. గురువారం ఉదయం గువాహటి నుంచి అగర్తలా వెళ్లనున్నారు. కాగా, గువాహటి చేరుకున్న అమిత్​ షాకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గురువారం అగర్తలాలో జరగబోయే రథయాత్రను అమిత్​ షా ప్రారంభించనున్నారు.

పారిస్​ విమానం అత్యవసర ల్యాండింగ్​..
పారిస్​ వెళ్లే ఎయిర్​ ఇండియాకు చెందిన ఏఐ143 విమానం దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో అత్యవసర ల్యాండింగ్​ అయింది. బుధవారం రాత్రి 1.30 గంటలకు సాంకేతిక లోపం వల్ల తిరిగి ల్యాండ్​ అయింది. ఈ విమానంలో 210 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్​, ఫైర్ విభాలతోపాటు అన్ని సెక్యూరిటీ విభాగాలు అలెర్ట్​ అయ్యాయి. అత్యవసర ల్యాండింగ్​ కోసం ఐజీఐ ఎయిర్​పోర్టులోని కొంత భాగం మూసేశారు.

కాగా, ఆ విమానంలో ఫ్లాప్​ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఈ ఫ్లాప్​ అనేది విమానంలో ముఖ్య భాగాల్లో ఒకటి. ఇది విమానం ల్యాండ్​ అయ్యేటప్పుడు.. దాని వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే విమానం వేగం పెరుగుతుంది. కానీ విమానంలో ఈ సాంకేతిక లోపం ఎలా వచ్చిందో తెలియలేదు. సాంకేతిక లోపం సరిచేశాక విమానం మళ్లీ ఎప్పుడు బయలుదేరిందో అనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు.

Last Updated : Jan 5, 2023, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details