తెలంగాణ

telangana

సీబీఐ చేతికి జడ్జి హత్య కేసు విచారణ

By

Published : Aug 4, 2021, 10:22 PM IST

jharkhand judge case death

ఝార్ఖండ్​ ధన్​బాద్​ జిల్లా అదనపు న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​ హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఝార్ఖండ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విచారణను స్వీకరిస్తున్నట్లు తెలిపింది.

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోజులై 28న జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ను ఆటోతో ఢీ కొట్టి హత్య చేసిన కేసు విచారణను సీబీఐ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఝార్ఖండ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విచారణను స్వీకరిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. నిబంధనల ప్రకారం ధన్‌బాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను అందుకున్నట్లు వెల్లడించింది.

పోస్టు మార్టం నివేదికలో..

న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​ చనిపోవడానికి ముందు బలమైన వస్తువు.. ఆయన తలపై తాకినట్లుగా పోస్టుమార్టం నివేదికలో తేలింది. తలపై గాయం కారణంగానే ఆయన చనిపోయినట్లు వెల్లడైంది. పోస్టుమార్టం సమయంలో తలపై పదిగాయాలను వైద్య సిబ్బంది గుర్తించారు. అందులో.. మూడు గాయాలు తలపై భాగంలో తాకినట్లు తేలగా.. మరో ఏడు గాయాలు తల లోపల తాకినట్లు తేలింది. గాయపడిన తర్వాత భారీగా రక్తస్రావమైనట్లు వెల్లడైంది.

ఇదీ జరిగింది

గత నెల 28 తెల్లవారుజామున వాకింగ్​కు వెళ్లిన న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్.. దుండగులు ఆటోతో వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్​తో పాటు అతడి అనుచరుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్​ అయిన దృశ్యాలను చూస్తే ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు యత్నించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

న్యాయ వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనపై.. ఝార్ఖండ్‌ హైకోర్టు సుమోటోగావిచారణ చేపట్టింది.

ఇదీ చూడండి:న్యాయమూర్తులపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి

ABOUT THE AUTHOR

...view details