ETV Bharat / bharat

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్ - ఆ రైళ్ల దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే - కొత్తరూట్ ఇలా! - These Route Trains Diverted

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 2:38 PM IST

Tirupati
Tirupati Trains

Tirupati Trains : సమ్మర్​లో తిరుపతి(Tirupati)కి ట్రైన్​లో వెళ్లేందుకు ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకో అలర్ట్​. సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా.. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. అందులో తిరుపతి వెళ్లే ట్రైన్స్ ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

These Tirupati Trains Diverted : తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలవాడిని దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణ సమయంలోనే తిరుమలలో(Tirumala) రద్దీ అధికంగా ఉంటుంది. ఇక సమ్మర్​లో అంటారా.. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో మీరూ సమ్మర్​లో తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అది కూడా ట్రైన్​లో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్.

దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా మరికొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఈ దారి మళ్లించిన రైళ్లలో తిరుపతి వెళ్లే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ, ఆ దారి మళ్లించిన రైళ్లు ఏంటి? అవి వెళ్లే కొత్త రూట్ ఏంటి? అదేవిధంగా ఏ ఏ రైళ్లను రద్దు చేశారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆదిలాబాద్ - తిరుపతి(ట్రైన్ నంబర్ 17406), తిరుపతి - ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17405) మధ్య నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవి ప్రస్తుతం.. గూడూరు, విజయవాడ, కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంటాయి. అయితే, తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు అందుబాటులో ఉండే ట్రైన్​(17405)ను ఏప్రిల్ 29, 2024 నుంచి మే 10 వ తేదీ వరకు, మే 16 నుంచి మే 22 వరకు దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది సౌత్ సెంట్రల్ రైల్వే. అదేవిధంగా.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17406)ను ఏప్రిల్ 28, 2024 నుంచి మే 9 వరకు, మే 15 నుంచి మే 21 వరకు రోజు ప్రయాణించే మార్గంలో కాకుండా కొత్త రూట్​లో ప్రయాణించనుంది.

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో!

ఇవి ప్రయాణించనున్న కొత్త రూట్ ఇదే : ఈ దారి మళ్లించిన రైళ్లు పైన పేర్కొన్న తేదీలలో.. పెదవడ్లపూడి, దుగ్గిరాల, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెకొండ, వరంగల్, కాజీపేట్, ఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి, జనగాం, ఆలేర్, యాదాద్రి, భువనగిరి మీదుగా ప్రయాణించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రద్దు చేసిన రైళ్ల వివరాలిలా :

  • సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాటిలో.. భద్రాచలం రోడ్ నుంచి విజయవాడ వరకు ప్రయాణించే ట్రైన్​ను(07278)ను ఏప్రిల్ 22 నుంచి మే 26 వరకు క్యాన్సిల్ చేసింది.
  • అదేవిధంగా.. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడిచే ట్రైన్(07979)ను ఈ నెల 22 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.
  • ఏప్రిల్ 29 నుంచి మే 22 వరకు డోర్నకల్ నుంచి విజయవాడ వరకు నడిచే రైలు(07755)ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది.
  • అలాగే.. విజయవాడ నుంచి డోర్నకల్ వరకు నడిచే ట్రైన్​ను(07756) ఈ నెల 29వ తేదీ నుంచి మే 22 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.