తెలంగాణ

telangana

గోవాలోనూ ముఖ్యమంత్రిని మార్చనున్న భాజపా?

By

Published : Oct 24, 2021, 6:56 AM IST

ఇటీవల పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తూ వస్తున్న భాజపా.. గోవా సీఎంను (Goa CM change news) కూడా తప్పించనుందా? ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు తనకు చెప్పాయని ఆప్​ సీనియర్​ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

BJP rules out leadership change in Goa after AAP claims CM Sawant on his way out
గోవాలోనూ ముఖ్యమంత్రిని మార్చనున్న భాజపా

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. గోవా ముఖ్యమంత్రి (Goa CM change news) ప్రమోద్‌ సావంత్‌ను భాజపా మార్చనుందని ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) ఆరోపించింది. ఆప్‌ సీనియర్‌ నాయకుడు మనీశ్‌ సిసోడియా శనివారం.. విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌ ఆధ్వర్యంలో ఎన్నికలకు (Goa Assembly Election 2022) వెళ్తే గెలవడం కష్టమని భావిస్తున్న భాజపా ఆయనను మార్చనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని వివరించారు. ఎన్నికలకు(Goa Assembly Election 2022) రెండు, మూడు నెలల ముందు ఈ మార్పు చోటు చేసుకుంటుందని చెప్పారు. భాజపా కొత్త ముఖ్యమంత్రిని (Goa CM change news) నియమించినప్పటికీ గోవాలో గెలుపు తమదేనని మనీశ్​ అన్నారు.

అదేం లేదు..!

అయితే ఈ ఆరోపణలను భాజపా ఖండించింది. సావంత్​ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు గోవా భాజపా అధ్యక్షుడు సదానంద్​​ తనవాడే.

''ముఖ్యమంత్రిని మార్చాలన్న ఉద్దేశం మాకు లేదు. గోవా ఎన్నికల్లో వ్యూహాల గురించే దిల్లీలో శుక్రవారం భేటీ అయ్యాం. ఇంకేం లేదు.''

- సదానంద్​ తనవాడే, గోవా భాజపా చీఫ్​

ఇటీవల భాజపా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చింది. కర్ణాటకలో యడియూరప్ప, గుజరాత్​లో విజయ్​ రూపానీ, ఉత్తరాఖండ్​లో తీరథ్​ సింగ్​ రావత్​లను తప్పించి వారి స్థానాల్లో బసవరాజ్​ బొమ్మై, భూపేంద్ర పటేల్​, పుష్కర్​ సింగ్​ ధామీలను నియమించింది.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌, వామపక్షాలకు ఓటేస్తే నోటాకు వేసినట్లే'

ABOUT THE AUTHOR

...view details