తెలంగాణ

telangana

కేంద్రంపై దీదీ నిప్పులు- పీఎం కేర్స్​ నిధులపై ప్రశ్న

By

Published : Dec 2, 2020, 5:36 AM IST

కేంద్రంపై నిప్పులు చెరిగారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పీఎం కేర్స్‌ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలతో కేంద్రం తమను భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఏం చేసినా తాము వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల విషయంలో భాజపాకు ఏ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని, రైతుల విషయంలో ఆ పార్టీ మొండి వైఖరి అవలంబించడం సరికాదని మమత విమర్శలు చేశారు.

Where-has-PM-CARES-Fund-money-gone-asks-Mamata
కేంద్రంపై దీదీ నిప్పులు- పీఎం కేర్స్​ నిధులెపై ప్రశ్న

దర్యాప్తు సంస్థలతో కేంద్రం తమను భయపెట్టాలని చూస్తోందని పశ్చిమ్​ బంగా‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అత్యవసర సమయంలో ప్రజల్ని ఆదుకోవడానికి కేటాయించిన పీఎం కేర్స్‌ నిధులు ఎక్కడ వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ‘పీఎం కేర్స్‌కు కేటాయించిన లక్షల కోట్ల నగదు ఎక్కడ పోతోంది? ఆ నిధుల గురించి భవిష్యత్తు ఎవరికైనా తెలుసా? కేంద్రం మాకు మాత్రం పాఠాలు చెబుతుంది. కానీ వారు ఎందుకు ఆ నగదుపై ఆడిట్‌ నిర్వహించడం లేదు. కరోనా వైరస్‌తో పోరాటం చేయడానికి కేంద్రం మాకు ఏవిధంగా సాయపడిందో చెప్పాలి’ అని కేంద్రంపై మమత నిప్పులు చెరిగారు.

సమీక్షకు ఓకే..

దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షించేందుకు ఈనెల 4న కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. అయితే మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు కూడా ఇదేవిధంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవటాన్ని తప్పుపట్టారు.

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్‌లో శాంతి భద్రతలు ఎంతో బాగున్నాయన్నారు. మమ్మల్ని భయపెట్టడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ.. ఏం చేసినా తాము వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల విషయంలో భాజపాకు ఏ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని.. రైతుల విషయంలో భాజపా మొండి వైఖరి అవలంబించడం సరికాదని మమత విమర్శలు చేశారు. కాగా బంగాల్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: పాక్ భూభాగంలోకి 200మీ. చొచ్చుకెళ్లిన బీఎస్ఎఫ్

ABOUT THE AUTHOR

...view details