ETV Bharat / bharat

పాక్ భూభాగంలోకి 200మీ. చొచ్చుకెళ్లిన బీఎస్ఎఫ్

author img

By

Published : Dec 1, 2020, 9:01 PM IST

దేశంలోకి చొరబడేందుకు జైషే ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ ముఖభాగాన్ని పాకిస్థాన్​లో గుర్తించింది బీఎస్ఎఫ్. ఇందుకోసం పాక్​ భూభాగంలోకి 200 మీటర్ల మేర చొచ్చుకెళ్లింది. ఆధారాల కోసం వీటి చిత్రాలను తీసింది.

BSF team had walked 200 m inside Pak territory to unearth cross-border tunnel: Officials
పాక్ భూభాగంలోకి 200మీ. చొచ్చుకెళ్లిన బీఎస్ఎఫ్

జమ్ము కశ్మీర్​లోని నగ్రోటా ప్రాంతంలో నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సరిహద్దు రక్షణ దళం.. వారి చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన సొరంగాన్ని ఇదివరకే గుర్తించిన బీఎస్​ఎఫ్.. దాని ముఖభాగాన్ని కనిపెట్టేందుకు 200 మీటర్ల మేర పాకిస్థాన్​ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది.

ఉగ్రవాదులను ఎన్​కౌంటర్ చేసిన వెంటనే.. వారు ఎలా వచ్చారనే విషయంపై బీఎస్ఎఫ్ విచారణ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. భారత్​వైపు గుర్తించిన సొరంగాన్ని అనుసరిస్తూ ముఖభాగాన్ని కనుగొన్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల సెల్​ఫోన్లలోని ఎలక్ట్రానిక్, భౌగోళిక సమాచారాన్ని ఇందుకోసం ఉపయోగించినట్లు తెలిపారు.

"సొరంగం ముఖ భాగం ఉన్న ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలో 200 మీటర్ల లోపల ఉందని బీఎస్ఎఫ్ బృందం గుర్తించింది. ఆధారాల కోసం పాకిస్థాన్ భూభాగంలో సొరంగం చిత్రాలను తీసుకుంది."

-అధికారులు

న‌గ్రోటాలో నవంబర్ 19న జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాన్ టోల్‌ప్లాజా వద్ద ఓ ట్రక్కులో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు తనిఖీలు నిర్వహించి.. వారిని మట్టుబెట్టాయి.

ఇదీ చదవండి- 'నగ్రోటా ఉగ్రదాడి.. ఆ సంస్థ ప్రణాళిక ప్రకారమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.