తెలంగాణ

telangana

'స్పైవేర్​ గురించి ప్రభుత్వాన్ని ముందే అప్రమత్తం చేశాం'

By

Published : Nov 3, 2019, 5:13 PM IST

ఇజ్రాయెల్​ స్పైవేర్​ పెగాసస్​..121 మంది భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని సెప్టెంబర్​లోనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్​ తెలిపింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. వాట్సాప్​ వివరణలో సరైన సమాచారం లేదని పేర్కొంది. గతంలో అందించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నట్లు పేర్కొంది.

'స్పైవేర్​ గురించి ప్రభుత్వాన్ని ముందే అప్రమత్తం చేశాం'

ఇజ్రాయెల్​ స్పైవేర్​ 'పెగాసస్'పై కేంద్రానికి నివేదిక సమర్పించింది వాట్సాప్​. పెగాసస్‌.. 121 మంది భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

తాజా వివరణపై పూర్తి వివరాలు వెలువరించలేదు వాట్సాప్​. అయితే మే నెలలోనే స్పైవేర్​పై సమాచారం అందించినట్టు.. అనంతరం సెప్టెంబర్​లో రెండోసారి ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపింది. సుమారు 121 మంది భారతీయ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లిందని అధికార వర్గాల దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

గత సమాచారం అసంపూర్ణం..

భారతీయ విలేకరులు, మానవహక్కుల కార్యకర్తలను ఇజ్రాయెల్​ స్పైవేర్​ లక్ష్యంగా చేసుకున్న అంశంపై వాట్సాప్​ నుంచి నివేదిక అందినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దానిపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

గతంలో వాట్సాప్​ నుంచి కొంత సమాచారం అందిందని ఐటీశాఖ వెల్లడించింది. కానీ ఆ సమాచారం పూర్తి అసంపూర్ణంగా, పూర్తి సాంకేతిక పరిభాషతో ఉన్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details