తెలంగాణ

telangana

చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోన్న అక్కాచెల్లెళ్లు

By

Published : Oct 13, 2020, 12:32 PM IST

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆడ పిల్లలు ఇంట్లోనే ఉండాలన్న పాత నానుడిని పక్కనపెట్టి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.అనారోగ్యం కారణంగా తండ్రి మంచాన పడితే అన్నీ తామై తండ్రి చేస్తున్న చేపల వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఔరా! అనిపిస్తున్నారు.

Two Kerala girls take to selling fish to support their family
చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోన్న అక్కాచెల్లెళ్లు

చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోన్న అక్కాచెల్లెళ్లు

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు చేపలు అమ్ముతూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. చిన్నవయసులోనే కుటుంబాన్ని పోషిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

కుటుంబ నేపథ్యం :

ఇడుక్కి జిల్లా ఇరుంబుపాలెం గ్రామానికి చెందిన వెట్టిక్కల్​ మనోజ్​కు శిల్ప, నందన ఇద్దరు కూతుళ్లు. మనోజ్​ చేపల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవారు. శిల్ప బీబీఏ చదువుతోంది. నందన 10వతరగతి పూర్తిచేసింది.

అన్నీ తామైన అక్కాచెల్లెళ్లు :

తండ్రి వెట్టిక్కల్​ మనోజ్​కు ప్రమాదవశాత్తు రెండు కాళ్లకు గాయాలయ్యాయి. డాక్టర్లు కాలు బయట పెట్టొద్దన్నారు. ఆ కుటుంబానికి మనోజ్​​ సంపాదన మాత్రమే ఆధారం. దీంతో మంచాన పడ్డ తండ్రిని చూసి కుమిలిపోకుండా అన్నీ తామై తండ్రి బాటలో చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.

మనోధైర్యంతో ముందడుగు :

అక్కాచెల్లెళ్లు రోజూ ఉదయాన్నే మార్కెట్​కి వెళ్లి చేపలు తెచ్చి ఊర్లో విక్రయిస్తున్నారు.మొదట్లో గ్రామస్థులు హేళన చేసినా తరువాత వారి ధైర్యం, శ్రమ చూసి మెచ్చుకున్నారు. చేపలు కొంటూ వారికి సహకరిస్తున్నారు.

ఇదీ చదవండి :ఆ నిందితుడికి పూల మాలతో పోలీసుల స్వాగతం

ABOUT THE AUTHOR

...view details