తెలంగాణ

telangana

'ట్రంప్ రాకపై అనుమానం... అయినా సర్వం సిద్ధం'

By

Published : Feb 23, 2020, 4:39 PM IST

Updated : Mar 2, 2020, 7:32 AM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నుంచి రెండురోజుల పాటు భారత్​లో పర్యటించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం గాంధీజీ నివసించిన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించాల్సి ఉంది. ఈ కార్యక్రమంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సబర్మతీ వద్ద యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

trump-sabarmati
'ట్రంప్ రాకపై అనుమానం... అయినా సర్వం సిద్ధం'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన సబర్మతీ ఆశ్రమాన్ని అధ్యక్షుడు సందర్శించడంపై సందిగ్ధం నెలకొంది. సబర్మతీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ట్రంప్ రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

"ట్రంప్ రాక కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడి ఆశ్రమ సందర్శనపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ అంశమై మరికొద్ది గంటల్లో విదేశాంగ శాఖ వర్గాలు నిర్ధరిస్తాయి."

-గుజరాత్ అధికార యంత్రాంగం

అగ్రరాజ్య అధ్యక్షుడి సందర్శన కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ కార్యదర్శి అమృత్ మోదీ ప్రకటన విడుదల చేశారు. సబర్మతీ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీ కటౌట్​ను నెలకొల్పారు. అధ్యక్షుడి రాక నేపథ్యంలో ఆశ్రమ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డాగ్​స్క్వాడ్​తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సీఎం స్పందన...

ట్రంప్ సబర్మతీ సందర్శనపై వివరణ ఇచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​రూపానీ. ఈ అంశమై శ్వేతసౌధ వర్గాల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉందని పేర్కొన్నారు. ఆశ్రమానికి అధ్యక్షుడి రాకపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సీఎం రూపానీ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

మహాత్మాగాంధీ సతీమణి కస్తూర్బా సమేతంగా 1918 నుంచి 1930 వరకు 12 ఏళ్లపాటు జీవించిన సబర్మతీ ప్రాంతానికి దేశ చరిత్రలో విశేష ప్రాధాన్యం ఉంది.

ఇదీ చూడండి:ట్రంప్ 'మెనూ'లో నోరూరించే గుజరాతీ వంటకాలు

Last Updated : Mar 2, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details