ETV Bharat / bharat

ట్రంప్ 'మెనూ'లో నోరూరించే గుజరాతీ వంటకాలు

author img

By

Published : Feb 23, 2020, 3:18 PM IST

Updated : Mar 2, 2020, 7:29 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాల కోసం గుజరాతీ సంప్రదాయ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఖమాన్​, బ్రోకలీ సమోసా, తేనె కుకీలు, మల్టీ గ్రెయిన్ రోటీలు, కొబ్బరి నీళ్లు, ఐస్ టీ, స్పెషల్​ ఛాయ్​లను అగ్రదేశాధినేత రుచి చూడనున్నారు.

trump menu
ట్రంప్ 'మెనూ'లో నోరూరించే గుజరాతీ వంటకాలు

మొదటిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కోసం గుజరాతీ రుచులు సిద్ధమవుతున్నాయి. వీరి మెనూలో ఖమాన్, మల్టీగ్రెయిన్ రోటీలతో పాటు మరిన్ని రుచికరమైన వంటకాలు చేర్చనున్నారు. ట్రంప్ దంపతులను తమ వంటలతో మైమరిపించేందుకు... ఫార్చూన్ ల్యాండ్​మార్క్ హోటల్​ చీఫ్​ చెఫ్​ సురేశ్​​ ఖన్నా రంగంలోకి దిగారు.

గుజరాతీ స్థానిక వంటకాలైన బ్రోకలీ సమోసా, తేనె కుకీలు, మల్టీగ్రెయిన్ కుకీలు, కొబ్బరి నీళ్లు, ఐస్​ టీ, స్పెషల్​ ఛాయ్​, స్నాక్స్​లను అగ్రదేశ అతిథులకు రుచి చూపించబోతున్నట్లు సురేశ్​ స్పష్టం చేశారు. ఈ మెనూకు భద్రతా తనిఖీలు కూడా జరిగినట్లు వెల్లడించారు.

"ఇది మాకు ప్రత్యేకమైన రోజు. అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటన కోసం నిజంగా ఎదురుచూస్తున్నాం. వారి కోసం గుజరాతీ వంటకాలు సిద్ధం చేస్తున్నాం." - చీఫ్​ చెఫ్​ సురేష్​ ఖన్నా

స్వాగత సన్నాహాలు

ఫిబ్రవరి 24,25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​లో పర్యటించనున్నారు. ఆయన కోసం గుజరాత్ అహ్మదాబాద్​లో​ భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నారు.

'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొనడానికి మోటేరా స్టేడియానికి వెళ్లే ముందు, ట్రంప్​ సబర్మతి ఆశ్రమాన్ని దర్శించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: '2 దేశాల కోసం 2 పులుల స్నేహం'

Last Updated : Mar 2, 2020, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.