తెలంగాణ

telangana

నేడు ప్రధాని మోదీ 67వ 'మన్​ కీ బాత్​'

By

Published : Jul 26, 2020, 7:25 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహించే మనసులో మాట (మన్​ కీ బాత్​) కార్యక్రమం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ మేరకు ట్వీట్టర్​ ద్వారా ప్రకటన చేశారు మోదీ. కరోనా వేళ కలిసికట్టుగా చేస్తోన్న ప్రయత్నాలు ఏవిధంగా సానుకూల మార్పులు తెచ్చాయో తెలిపే పలు స్ఫూర్తినిచ్చే అంశాలు ఈ మన్​కీ బాత్​లో దేశ ప్రజలు తెలుసుకుంటారన్నారు.

modi mann ki baat
నేడు ప్రధాని మోదీ 67వ 'మన్​ కీ బాత్​'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 67వ మనసులో మాట (మన్​ కీ బాత్​) రేడియో కార్యక్రమం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ట్వీట్టర్​ ద్వారా తెలిపారు మోదీ.

అయితే ఈ నెల కార్యక్రమంపై 11 వ తేదినే ట్వీట్ చేశారు ప్రధాని. దేశ ప్రజలు పలు కీలక విషయాలు తెలుసుకుంటారని నాటి ట్వీట్​లో పేర్కొన్నారు.

"కరోనా విపత్తు వేళ ప్రభుత్వాలు, ప్రజలు చేస్తోన్న సామూహిక ప్రయత్నాలు ఏవిధంగా సానుకూల మార్పులు తీసుకొచ్చాయో స్ఫూర్తినిచ్చే అంశాల గురించి తెలుస్తుంది. అనేక జీవితాలను మార్చిన కార్యక్రమాల గురించి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటివి ఉంటే తప్పకుండా ఈనెల 26న జరగబోయే మనసులో మాట కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గత నెల జూన్​ 28న జరిగిన మనసులో మాట కార్యక్రమంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్​ ఎదుర్కొని నిలబడుతుందని దేశ చరిత్ర చెబుతోందన్నారు. విపత్తు తర్వాత మరింత బలోపేతమవుతామన్నారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్​ 'స్పీక్​ అప్​ ఫర్​ డెమొక్రసీ'

ABOUT THE AUTHOR

...view details