ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్​ 'స్పీక్​ అప్​ ఫర్​ డెమొక్రసీ'

author img

By

Published : Jul 26, 2020, 5:51 AM IST

Congress to conduct 'Speak up or democracy' campaign against government
దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్​ 'స్పీక్​ అప్​ ఫర్​ డెమొక్రసీ'

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడానికి భాజపా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా "స్పీక్​ అప్​ ఫర్​ డెమొక్రసీ" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్​ ప్రకటించింది. ఇదే విషయంపై సోమవారం పీసీసీలు రాజ్​ భనవ్​ల వద్ద తమ నిరసనలు తెలుపుతాయని వెల్లడించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోమారు తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్​. దేశవ్యాప్తంగా ఆన్​లైన్​ ద్వారా.. నేడు "స్పీక్​ ఆప్​ ఫర్​ డెమొక్రసీ" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. రాజకీయ వ్యవస్థలను దుర్వినియోగించి.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు పేర్కొంది.

"ప్రజలు ఎన్నుకన్న ప్రభుత్వాలను కూల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు, రాజ్యంగా సంస్థలను దుర్వినియోగిస్తున్న తీరుతో భాజపాకు వ్యతిరేకంగా 26న దేశవ్యాప్తంగా "స్పీక్​ అప్​ ఫర్​ డెమొక్రసీ" ఆన్​లాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్​ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి గళం విప్పండి​."

--- కేసీ వేణుగోపాల్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

అనంతరం ఇదే విషయంపై సోమవారం దేశవ్యాప్తంగా పీసీసీలు రాజ్​భవన్​ల​ వద్ద నిరసనలు చేపడతాయని వేణుగోపాల్​ వెల్లడించారు.

కరోనా సంక్షోభం, చమురు ధరలు, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇటీవలే పలు ఆన్​లైన్​ కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్​. పార్టీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్​, ప్రియాంకా గాంధీ సహా అనేకమంది.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ వీడియోలను విడుదల చేశారు.

ఇవీ చూడండి:-

'సంక్షోభాన్ని స్వలాభానికి వాడుకుంటున్న ప్రభుత్వమిది'

కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలివే: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.