తెలంగాణ

telangana

దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Aug 8, 2020, 6:55 PM IST

దేశంలో కరోనా రక్కసి విస్తరణ కొనసాగుతోంది. తమిళనాడులో రోజూ 5వేలపైనే కేసులు బయటపడుతున్నాయి. కేరళ, దిల్లీలోనూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒడిశాలో కొవిడ్​ కేసులు 44 వేలు దాటాయి.

Overall reported Coronavirus cases and death toll in India
తమినాట రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తమిళనాడులో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా 5,883 మందికి కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. మరో 118 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 2,90,907కు చేరాయి. మరణాల సంఖ్య 4,808కు పెరిగింది.

కేరళలో కొత్తగా 1,420 మందికి కరోనా సోకింది. మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రరాజధాని తిరువనంతపురంలోనే 485 కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధాని దిల్లీలో ఒక్కరోజే 1,404 మంది వైరస్​ బారిన పడ్డారు. 16 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 44వేలు దాటింది. ఇప్పటివరకు 4,098 మంది మరణించారు.

ఒడిశాలో తాజాగా 1,643 కేసులు వెలుగుచూశాయి. మరో 12మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 44 వేలు దాటగా... మృతుల సంఖ్య 259కు చేరింది.

ఇదీ చూడండి:భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం

ABOUT THE AUTHOR

...view details