తెలంగాణ

telangana

'ఆ ప్రజాప్రతినిధుల కేసులకు అధిక ప్రాధాన్యం'

By

Published : Nov 4, 2020, 2:19 PM IST

ప్రజాప్రతినిధులకు సంబంధించి అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం పదవిలో ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు అమికస్ క్యూరీ హన్సారియా. నేతల పెండింగ్ కేసుల వ్యవహారంపై రాష్ట్రాల హైకోర్టులు అందజేసిన నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తూ ఈ సూచనలు చేశారు.

sc
సుప్రీం

ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు అందించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు అమికస్ క్యూరి విజయ్​ హన్సారియా. చాలా రాష్ట్రాలు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించలేదని.. జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మసనానికి వివరించారు.

కనీసం రెండేళ్లకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించేలా రాష్ట్రాలను ఆదేశించాలని ధర్మసనాన్ని కోరారు హన్సారియా. ఈ మేరకు కొన్ని ధర్మసనానికి కొన్ని సూచనలు చేశారు.

"కేసులను ప్రాధాన్య క్రమంలో విచారించాలి. కొత్త కేసులు, అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షులకు భద్రత కల్పించడంపై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి" అని కోర్టును కోరారు హన్సారియా.

మూడు రాష్ట్రాల్లో..

కర్ణాటక, బంగాల్​, తమిళనాడులో ప్రత్యేక కోర్టుల సరిపడా లేవని, వాటిని ఏర్పాటు చేసేలా హైకోర్టులను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు అమికస్ క్యూరీ. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై నివేదిక అందించాలని ఈ రాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది.

సహకరిస్తాం: కేంద్రం

ఈ కేసులో కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందన్నారు సొలిసిటర్ జనరల్​ తుషార్ మెహతా. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలను ఎందుకు సమర్పించలేదని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించగా.. వేరే కేసు విచారణలో ఉన్నందున సమయానికి వివరాలు ఇవ్వలేకపోయామని మెహతా వివరించారు. తదుపరి విచారణ తేదీకి వివరాలు సమర్పిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details