తెలంగాణ

telangana

అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్​

By

Published : Aug 13, 2020, 3:37 PM IST

పార్టీలో నెలకొన్న అపార్థాలను విడనాడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. సచిన్ ​పైలట్​ వర్గం సొంత గూటికి చేరిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్​ నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్​ పోరాడుతోందన్నారు.

Gehlot
అపార్థాలను విడనాడి ముందుకు సాగాలి: గహ్లోత్​

రాజస్థాన్​లో అసంతృప్తి నేత సచిన్​ పైలట్​ వర్గం సొంత గూటికి చేరడం వల్ల రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఈ నేపథ్యంలో పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. కాంగ్రెస్​లో నెలకొన్న అపార్థాలను విడనాడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడాలని ట్వీట్​ చేశారు.

" దేశం, రాష్ట్రం, ప్రజలు, ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం గత నెల రోజులుగా పార్టీలో నెలకొన్న ఎలాంటి అపార్థాలనైనా వదిలేయాల్సిన అవసరం ఉంది. క్షమాగుణంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో మన శక్తులన్నింటినీ ధారపోయాలి. అన్నింటినీ వదిలేసి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రమాదకరమైన ఆట ప్రస్తుతం దేశంలో కొనసాగుతోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్​, అరుణాచల్​ప్రదేశ్​ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు దేశంలోని ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను ఒకదాని వెనక ఒకటి కూలదోసేందుకు కుట్ర జరుగుతోంది. పార్టీ అధ్యక్షులు సోనియా, రాహుల్​ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్​.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తోంది."

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి

ఈనెల 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆలోపు తిరుగుబాటు ఎమ్మెల్యేలు జైపుర్​ చేరుకుంటారని కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి. అలాగే గహ్లోత్​ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మీర్​ నుంచి జైపుర్​కు బుధవారమే చేరుకున్నారు. వారందరిని విమానాశ్రయం నుంచి నేరుగా ఫేయిర్​మౌెంట్​ హోటల్​కు తరలించారు. అసెంబ్లీ సమావేశాల వరకు వారు అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: పైలట్ తిరిగొచ్చినా యథావిధిగా బలపరీక్ష!

ABOUT THE AUTHOR

...view details