తెలంగాణ

telangana

భవానీపుర్​ ఉపఎన్నిక వాయిదా వేస్తారా?

By

Published : Sep 27, 2021, 3:44 PM IST

Updated : Sep 27, 2021, 7:17 PM IST

బంగాల్​ భవానీపుర్​లో(Bhabanipur Election) భాజపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తుపాకీ కలకలం రేపింది. టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి తుపాకీతో కనిపించటంపై ఇరు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి. భవానీపుర్​లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఉపఎన్నిక వాయిదా వేయాలని భాజపా డిమాండ్ చేసింది.

Dilip Ghosh
భాజపా ప్రచారం

భాజపా ఎన్నికల ప్రచారంలో తుపాకీ కలకలం

బంగాల్​లోని భవానీపుర్ ఉపఎన్నికల(Bhabanipur Bypoll) ప్రచారంలో అధికార టీఎంసీ(TMC Party), భాజపా(Bengal BJP) కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల ప్రచారానికి హాజరైన భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు(BJP National Vice President), పార్టీ ఎంపీ దిలీప్​ ఘోష్​ను(Dileep Ghosh BJP) టీఎంసీ కార్యకర్తలు ఘోరావ్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ కనిపించటం కలకలం రేపింది.

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్​ ఘోష్

ఈ నెల 30న జరగనున్న భవానీపుర్ ఉపఎన్నిక ప్రచారానికి(Bhabanipur Election date 2021) సోమవారం ఆఖరి రోజు. ఈ క్రమంలోనే దిలీప్​ ఘోష్ హజరవ్వగా ఆయన​కు వ్యతిరేకంగా టీఎంసీ మద్దతుదారులు ఆందోళనకు(bjp tmc clash) దిగారు. ఇరు పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు దిలీప్​ ఘోష్​ భద్రతా విభాగంలోని ఓ అధికారి.. తన సర్వీస్​ పిస్టల్​ను​ బయటకు తీసి.. తృణమూల్ కాంగ్రెస్​ కార్యకర్తల వైపు గురిపెట్టారు.

భవానీపుర్ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు గాయాలు

'వాయిదా వేయండి..'

ఈ గొడవపై స్పందించిన భాజపా.. ఘోష్​పై టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని ఆరోపించింది. ఓటమి భయంతోనే దాడులకు దిగుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు(bengal bjp chief) సుకంత మజుందార్​ విమర్శించారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఉపఎన్నికను వాయిదా వేయాలని దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తనను కాపాడకపోయి ఉంటే.. ఇప్పటికి మరణించేవాడినని అన్నారు.

ఆందోళనలో గాయపడిన కార్యకర్త

"టీఎంసీ మద్దతుదారులు నాపై దాడి చేశారు. మేం ఎలాంటి రెచ్చగొట్టే పనులు చేయకపోయినా.. వారు ఘర్షణకు దిగారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. ఉపఎన్నిక నిర్వహించే విధంగా శాంతి భద్రతల వాతావరణం ఇక్కడ లేదు. ఓ ఎంపీపైనే దాడులు జరుగుతున్నాయంటే.. సాధారణ ఓటర్ల సంగతేంటో ఆలోచించండి. ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు నెలకొనేవరకు ఉప ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం."

-దిలీప్ ఘోష్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు

ఈ ఆరోపణలు తిప్పికొట్టిన టీఎంసీ.. భవానీపుర్​లో భాజపాకు(bhabanipur bjp candidate) ఎలాంటి బలం లేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

రంగంలోకి ఈసీ

మరోవైపు, ఈ ఘటనపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన దీదీ సర్కారు.. ఘటన వివరాలు, వీడియో ఫుటేజీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. వీటిని దిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 27, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details