తెలంగాణ

telangana

'మా ఆవిడ నన్ను కొడుతోంది.. కేసు పెట్టొచ్చా?'.. ప్రధాని మోదీకి ఓ భర్త రిక్వెస్ట్

By

Published : Nov 2, 2022, 1:59 PM IST

భార్య కొడుతోందని ఓ వ్యక్తి.. పీఎంఓకు ట్వీట్​ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అనేక మంది నెటిజన్లు అతడికి మద్దతు తెలపగా.. బెంగళూరు పోలీస్ కమిషనర్ స్పందించారు.

Karnataka man says wife beats him, complains to PMs office
Karnataka man says wife beats him, complains to PMs office

భర్త కొడుతున్నాడని భార్య ఫిర్యాదు చేయడం చాలాసార్లు చూసుంటాం. కానీ కర్ణాటకలో మాత్రం సీన్​ రివర్స్. భార్య తనను వేధిస్తోందని ఓ భర్త వాపోయాడు. ఈ విషయమై ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పీఎంఓను, న్యాయయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు పోలీస్ కమిషనర్​ను ట్యాగ్ చేస్తూ.. తన బాధను వెళ్లగక్కాడు. స్పందించిన కమిషనర్​ అతనికి సహాయం చేస్తానని తెలిపారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. ఆ వ్యక్తికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

నారీ శక్తి అంటే ఇదేనా?
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య అనే ఓ వ్యక్తి తన భార్యపై పీఎంఓకు ఫిర్యాదు చేశాడు. ఆమె తరచూ తనను వేధిస్తోందని.. తనపై చేయి చేసుకుంటోందని ట్విట్టర్​లో తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆమె వల్ల తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె తనను కత్తితో గాయపరించిందని ఆరోపించాడు.

యదునందన్​ ట్వీట్​

"నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదా ఇది జరిగినప్పుడు ఎవరైనా సహాయం చేశారా? లేదు, ఎందుకంటే నేను మగవాడిని! నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు అంటున్న నారీ శక్తి ఇదేనా? దీని కోసం నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదు కదా!" అని ట్విట్టర్​లో యదునందన్​ పోస్ట్​ చేశాడు. ఈ ట్వీట్​కు స్పందించారు బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:చోరీ చేసిన బంగారాన్ని తిరిగి పార్సిల్​లో​ పంపించిన దొంగ!

మోర్బీ కేసులో నిందితులకు షాక్.. కేసు వాదించరాదని లాయర్ల నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details