ETV Bharat / bharat

మోర్బీ కేసులో నిందితులకు షాక్.. కేసు వాదించరాదని లాయర్ల నిర్ణయం

author img

By

Published : Nov 2, 2022, 1:15 PM IST

morbi-incident-lawyers-refuse-to-represent-nine-accused
morbi incident

135 ప్రాణాలు బలిగొన్న మోర్బీ ఘటనలో నిందితుల తరఫున వాదించరాదని స్థానిక న్యాయవాదులు నిర్ణయించారు. మోర్బీ బార్​ అసోషియేషన్​, రాజ్​కోఠ్​ బార్​ అసోషియేషన్​ ఈమేరకు తీర్మానం చేశాయి.

Morbi bridge collapse case: గుజరాత్​ మోర్బీ వంతెన కూలిన ఘటనలో నిందితుల పక్షాన వాదించేందుకు తాము సిద్ధంగా లేమని మోర్బీ బార్​ అసోషియేషన్​, రాజ్​కోఠ్​ బార్​ అసోషియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ మేరకు స్థానిక న్యాయవాదులు అంతా కలిసి నిర్ణయం తీసుకున్నాయని మోర్బీ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఏసీ ప్రజాపతి తెలిపారు.

ఒరేవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లు అరెస్టు..
మోర్బీ వద్ద వంతెన కూలిన ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒరేవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు కాంట్రాక్టర్లతో పాటు ఇద్దరు టికెట్ క్లర్కులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నలుగురు నిందితులను శనివారం వరకు పోలీసు కస్టడీకి, మరో ఐదుగురిని జ్యుడీషియల్ కస్టడీకి మోర్బీ కోర్టు బుధవారం పంపింది.

morbi-incident-lawyers-refuse-to-represent-nine-accused
మోర్బీ ఘటన నిందితులు

అసలేం జరిగింది:
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 135 మంది మరణించగా, 170 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని గుజరాత్​ ప్రభుత్వం తెలిపింది. సాయుధ బలగాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)తో పాటు మరి కొన్ని ఏజెన్సీలు మచ్చు నదిలో రెస్క్యూ ఆపరేషన్​ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. రక్షించిన వారిలో 14 మంది మాత్రమే ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

కారణం ఇదేనా?
దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడం వల్ల ఈ వంతెన వద్ద పర్యటకుల రద్దీ బాగా కనిపించింది. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడం వల్ల.. అధిక బరువును మోయలేక వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అయితే కొన్నేళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనకు దాదాపు 7 నెలల పాటు మరమ్మతులు చేసి ఈ నెల 26నే తిరిగి తెరిచారు. ఈలోపే ఈ ఘోర దుర్ఘటన జరిగింది.

ఇదీ చదవండి:మత్తుమందు ఇచ్చి బాలికపై సామూహిక అత్యాచారం

చెన్నైలో దంచికొట్టిన వాన.. 30 ఏళ్లలో ఇదే అత్యధికం.. పాఠశాలలకు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.