తెలంగాణ

telangana

Anupama Ajith Child Case: న్యాయపోరాటంతో బిడ్డను దక్కించుకున్న అనుపమ

By

Published : Nov 25, 2021, 7:20 AM IST

Anupama Ajith Child Case

కేరళకు చెందిన ఓ మహిళ న్యాయపోరాటం ద్వారా తన బిడ్డను దక్కించుకుంది. తన అనుమతి లేకుండా తండ్రి బిడ్డను (Anupama Ajith Child Case) దత్తతు ఇవ్వడంపై అనుపమ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా బుధవారం తీర్పును ఇచ్చింది.

కన్న కొడుకు కోసం ఏడాదిగా కేరళకు చెందిన ఓ మహిళ చేస్తున్న న్యాయపోరాటం (Anupama Ajith Child Case) ఫలించింది. దత్తత తీసుకున్న దంపతులు అనుపమకు బిడ్డను అప్పగించాల్సిందిగా స్థానిక కోర్టు ఆదేశించింది. దీంతో ఆ చిన్నారి ఎట్టకేలకు కన్నతల్లి ఒడిలో చేరాడు.

బాధితురాలి వివరాల ప్రకారం..

అనుపమ-అజిత్​ జంటకు ఏడాది క్రితం కొడుకు పుట్టాడు. కానీ పుట్టిన మూడు రోజులకే ఆ చిన్నారి తల్లిదండ్రులకు (Anupama Ajith Child Case) దూరమయ్యాడు. ఈ విషయంపై బాధితురాలు ఆరా తీయగా తండ్రే తన అనుమతి లేకుండా ఆ చిన్నారిని దత్తత ఇచ్చాడని.. ఇందుకు కుటుంబసభ్యులు కూడా సహకరించినట్లు తెలిసింది. దీంతో తన కుటుంబంపై చర్యలు తీసుకోవడం సహా బిడ్డ తనకు దక్కేలా చూడాలని (Anupama Ajith Child Case) పోలీసులను ఆశ్రయించింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కోర్టు మెట్లు ఎక్కింది. తన తండ్రి బలవంతంగా కుమారుడిని దత్తత ఇచ్చాడని, పోలీసులు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పిటిషన్​ దాఖలు చేసింది.

న్యాయస్థానం విచారణలో భాగంగా అనుపమ కుమారుడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన దంపతుల వద్ద ఉన్నట్లు తెలిసింది. చిన్నారి, అనుపమ-అజిత్​ జంటకు డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించగా సానుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం జరిగిన విచారణలో.. చిన్నారిని అనుపమకు అప్పగించాలంటూ కోర్టు ఆదేశించింది.

న్యాయస్థానం తీర్పుపై అనుపమ, ఆమె భాగస్వామి అజిత్​ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :Up Elections: ఆప్​తో ఎస్పీ పొత్తు- టార్గెట్ భాజపా!

ABOUT THE AUTHOR

...view details