తెలంగాణ

telangana

ఈవీఎం స్ట్రాంగ్​రూంపై బైనాక్యులర్స్​తో ఎస్​పీ అభ్యర్థి నిఘా

By

Published : Mar 8, 2022, 7:10 PM IST

EVM strong room binoculars: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ ఎస్పీ అభ్యర్థి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్​రూంపై బైనాక్యులర్స్​తో నిఘా వహిస్తున్నారు. మద్దతుదారులతో కలిసి మూడు షిప్టులు 8 గంటల చొప్పున 24 గంటలు అక్కడే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరకుండా చూసేందుకే ఇలా చేస్తున్నట్లు చెప్పారు.

sp-candidate-keeps-eye-on-evm-strong-room-with-binoculars
ఈవీఎం స్ట్రాంగ్​రూం పై బైనాక్యులర్స్​తో ఎస్​పీ అభ్యర్థి నిఘా

SP candidate binoculars: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. అయితే ఎన్నికల్లో హస్తినాపుర్​ నుంచి పోటీ చేసిన సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి యోగేశ్​ వర్మ చేస్తున్న పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్​రూంపై ఆయన బైనాక్యులర్స్​తో నిఘా పెడుతున్నారు. మద్దతుదారులతో కలిసి రోజంతా 24 గంటలపాటు స్ట్రాంగ్​రూంనే గమనిస్తున్నారు. దీని కోసం మూడు షిఫ్టులుగా విభజించుకొని ఒక్కొక్కరు 8 గంటలపాటు బైనాక్యూలర్స్​తో నిరంతరం స్ట్రాంగ్​రూం వద్ద పరిస్థితినే పరిశీలిస్తున్నారు. స్ట్రాంగ్​ రూం సమీపంలోనే మకాం వేశారు.

ఈవీఎం స్ట్రాంగ్​రూం పై బైనాక్యులర్స్​తో ఎస్​పీ అభ్యర్థి నిఘా

Yogesh verma

ఇలా ఎందుకు చేస్తున్నారని యోగశ్​ను అడిగితే.. తనకు అధికారులపై నమ్మకం ఉందని, కానీ ప్రజా తీర్పును పరిరక్షించేందుకు ఎలాంటి అవకాశాన్ని వదులుకోనని చెబుతున్నారు. అలాగే ఎగ్జిట్​ పోల్స్​పైనా ఆయన స్పందించారు. భాజపానే విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు ఇప్పటికే స్పష్టం చేయగా.. యోగేశ్ మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు. అవన్నీ తప్పుడు అంచనాలని పేర్కొన్నారు.

ఈవీఎం స్ట్రాంగ్​రూం పై బైనాక్యులర్స్​తో ఎస్​పీ అభ్యర్థి నిఘా

" ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదు. గతేడాది బంగాల్​లో భాజపా గెలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఫలితం ఎలా వచ్చింది? మమతా బెనర్జీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. యూపీ ఫలితాల చరిత్రను పరిశీలిస్తే హస్తినాపుర్ ఎమ్మెల్యే, సీఎం ఒకే పార్టీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది. "

-యోగేశ్ వర్మ, ఎస్పీ అభ్యర్థి

UP Assembly results

ఏడు విడతల్లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సోమవారమే ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్​ పోల్స్​ భాజపానే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. ఎస్పీ మాత్రం అంచనాలు తలకిందులు అవుతాయని, తామే గెలుస్తామని చెబుతోంది.

ఇదీ చదవండి:గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details