తెలంగాణ

telangana

వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి.. ఒకే కుటుంబంలో నలుగురు..

By

Published : Jun 4, 2022, 10:49 AM IST

Accidents news today: దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్​లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనల్లో 10 మంది చనిపోగా.. మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

accidents in madhya pradesh
accidents in madhya pradesh

Madhya Pradesh Accident news: మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మూడు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖండ్వా జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ఐదుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కాగా, మిగిలిన ముగ్గురు మహిళలు. ధనోరా గ్రామం వద్ద ఖిర్కియా- ఖల్వా రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు.

మొత్తం 35 మంది ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరంతా హర్సుద్ ప్రాంతంలో నిర్వహించిన ఓ ఫంక్షన్​కు వెళ్లి మేధపాని గ్రామానికి తిరిగివస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని వివరించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఖండ్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

బేతుల్ జిల్లాలోనూ ట్రాక్టర్ బోల్తా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగిందని చిచోలీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తారానుమ్ ఖాన్ తెలిపారు. 23 మంది గాయపడ్డారని తెలిపారు. ఇందులో 12 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని చెప్పారు. వీరు ఇమ్లిదానా గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై బోద్రి గ్రామానికి వెళ్తున్నారని వెల్లడించారు.

మరోవైపు, సింగ్రౌలీ జిల్లాలో ఓ ట్రక్కు.. మోటార్ సైకిల్​ను ఢీకొట్టడం వల్ల ఇద్దరు చనిపోయారు. మాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్రాహ్వ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ బాలుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనంపై వెనక కూర్చున్న బాలుడి తల్లి గాయపడిందని చెప్పారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Maharashtra accident same family: మహారాష్ట్రలో జరిగిన మరో ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నాందేడ్- హైదరాబాద్ హైవేపై ఓ ట్రక్కు కారును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదం వల్ల కొద్దిసేపు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పారు.

కారును ఢీకొట్టిన లారీ
నుజ్జునుజ్జు అయిన కారు

జమ్ము కశ్మీర్​లోని రాంబన్ జిల్లాలో ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తారిక్ హుస్సెన్ సహా సునీత్ సింగ్ అనే మరో వ్యక్తి మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details