తెలంగాణ

telangana

క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.కోట్ల మోసం.. హైదరాబాద్​లో ఇద్దరు అరెస్టు

By

Published : Mar 3, 2022, 7:10 PM IST

5 crore cryptocurrency fraud: క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై లాభాలను ఆశచూపి రూ.5 కోట్లతో ఉడాయించారు ఇద్దరు వ్యక్తులు. నిందితుల్లో ఓ మహిళ సైతం ఉందని పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ హైదరాబాద్​లో అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. వీరి మోసాలు రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 crore cryptocurrency fraud:
5 crore cryptocurrency fraud:

5 crore cryptocurrency fraud: క్రిప్టోకరెన్సీల పేరిట రూ.5 కోట్ల మోసాలకు పాల్పడిన ఇద్దరిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఓ మహిళ సైతం ఉందని పోలీసులు వెల్లడించారు. దెహ్రాదూన్​లోని వికాస్​నగర్​కు చెందిన 11మంది.. నిందితుల చేతిలో మోసపోయారని తెలిపారు.

Uttarakhand cryptocurrency fraud

ప్రధాన నిందితుడు చండీగఢ్​కు చెందిన గ్యాంగ్​స్టర్ కైలాశ్​గా, మహిళను శటాక్షి శుభమ్​గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరినీ హైదరాబాద్​లోని ఓ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద ఉత్తరాఖండ్​కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

ఉత్తరాఖండ్ ఎస్​టీఎఫ్ వివరాల ప్రకారం వికాస్ నగర్​కు చెందిన కొందరు వ్యక్తులను.. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో నిందితులు మోసాలు చేశారు. పలు కంపెనీలకు యజమానులమని చెప్పి.. 3-5 శాతం లాభాలు ఇప్పిస్తామని ఆశ చూపారు. క్రిప్టో కరెన్సీల ద్వారా భారీ లాభాలు పొందొచ్చనన్న ఆశతో రూ.5 కోట్లు నిందితుల వద్ద పెట్టుబడులు పెట్టారు. బాధితులు రూ.5 కోట్లను బదిలీ చేయగానే.. నిందితులు డబ్బుతో ఉడాయించారు.

వీరి మొత్తం మోసాలు రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:ఘరానా మోసాల కుటుంబం.. రూ.100 కోట్లకుపైగా టోకరా

ABOUT THE AUTHOR

...view details