తెలంగాణ

telangana

వంతెన కింద భారీగా జిలెటిన్ స్టిక్స్.. రైల్వేట్రాక్ పేల్చిన ప్రాంతానికి సమీపంలోనే

By

Published : Nov 17, 2022, 10:12 AM IST

ఇటీవల రాజస్థాన్ రైల్వేట్రాక్​పై పేలుడు జరిగిన ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో 186 కిలోల జిలెటిన్ స్టిక్స్​తో నింపిన ఏడు బస్తాలు దొరికాయి. భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేపింది.

186 kg gelatin sticks found under bridge in Rajastha
రాజస్థాన్​ బ్రిడ్జ్ కింద దొరికిన జిలెటిన్ స్టిక్స్

రాజస్థాన్ దుంగార్‌పుర్ జిల్లాలోని సియోమ్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్ కింద భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. సుమారు 186 కిలోల జిలెటిన్ స్టిక్స్​తో నింపిన ఏడు బస్తాలు పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైనింగ్​లలో బ్లాస్టింగ్​లకు ఉపయోగిస్తారు. ఉదయ్​పుర్​ రైల్వేట్రాక్​పై శనివారం- ఆదివారం రాత్రి పేలుడు జరిగిన ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

"స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. అక్కడ లోతులేని నీటిలో ఈ బస్తాలు దొరికాయి" అని పోలీసు అధికారి సవాంగ్ సింగ్ అన్నారు. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఉందని, చుట్టూ అనేక గనులున్నాయని చెప్పారు. అయితే "మైనింగ్​లో ఉపయోగించిన పాత జిలెటిన్ స్టాక్​ను ఎవరో అక్కడ పడేసి ఉంటారు. దీనిపై పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం" అని ఉదయ్​పుర్​ ఇన్​స్పెక్టర్ జనరల్ ప్రఫుల్ల కుమార్ తెలిపారు. అయితే రైల్వేట్రాక్​పై ఉపయోగించిన పేలుడు పదార్థాలు, ప్రస్తుతం దొరికిన జిలెటిన్ స్టిక్స్ వేర్వేరు అని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధం లేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details