తెలంగాణ

telangana

కారులో వచ్చి చాకెట్లు పంచిన 'బర్త్​డే బాయ్​'.. వెంటనే 17 మంది విద్యార్థులు..!

By

Published : Dec 3, 2022, 10:32 PM IST

Updated : Dec 3, 2022, 10:41 PM IST

గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్​లు తిన్న 17 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

students suffered food poisoning
అస్వస్థతకు గురైన విద్యార్థులు

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో విషాదం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి పంచిన చాక్లెట్​లు తిన్న 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నార్త్ అంబజారి రోడ్డులోని మదన్ గోపాల్ హైస్కూల్‌లోని 3, 4, 5వ తరగతి విద్యార్థులు భోజన విరామ సమయంలో పాఠశాల కాంపౌండ్ బయట ఆడుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కారుపై వచ్చి.. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చాడు. చాక్లెట్​లు తిన్న గంటలోనే విద్యార్థులందరికీ ఛాతీలో నొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే లతా మంగేష్కర్ ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు తన పుట్టినరోజని విద్యార్థులకు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అతడు నల్లటి కారులో ముసుగు ధరించి వచ్చినట్లు విద్యార్థులు.. పోలీసులకు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Last Updated :Dec 3, 2022, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details