ETV Bharat / bharat

'స్లో పాయిజన్​' ఇచ్చి భర్త హత్య.. ఆస్తి కాజేసేందుకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్​..

author img

By

Published : Dec 3, 2022, 8:29 PM IST

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. స్లో పాయిజన్​ను భర్త ఆహారంలో కలిపి ఈ దారుణానికి పాల్పడింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మరోవైపు, కన్న కూతురిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తండ్రి. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.

wife killed husband with lover
ప్రియుడితో కలిసి భర్త హత్య

మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ హత్యకేసును పోలీసులు తాజాగా ఛేదించారు. నిందితులు కవిత, ఆమె ప్రియుడు హితేశ్ జైన్​ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు కమల్‌కాంత్‌ షా (45) శాంతాక్రూజ్‌ వెస్ట్‌లో నివసించేవాడు. అతడికి కవిత అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కమల్​కాంత్ స్నేహితుడు హితేశ్​తో కవిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.

ఈ ఏడాది జూన్​లో కమల్​కాంత్ తల్లి మరణించింది. అనంతరం కమల్‌కాంత్‌ను హత్య చేసి అతడి ఆస్తి మొత్తాన్ని కాజేసేందుకు కవిత, ఆమె ప్రియుడు హితేశ్ ప్లాన్ వేశారు. కమల్​కాంత్​ తినే ఆహారంలో ఆర్సెనిక్ కలపడం ప్రారంభించారు. అది కాస్త స్లో పాయిజన్​గా మారింది. అలా కొంతకాలానికి కమల్​కాంత్​ ఆరోగ్యం క్షీణించింది. కడుపునొప్పితో బాధపడిన కమల్​కాంత్​ను ఆగస్టు 27న అంధేరీలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. మెరుగైన వైద్యం కోసం ముంబయిలోని ఓ ఆస్పత్రికి సెప్టెంబరు 3న తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కమల్​కాంత్ సెప్టెంబరు 19న మరణించాడు. అతడి శరీరంలో ఆర్సెనిక్, థాలియం ఉన్నట్లు వైద్య నివేదికలో తేలింది. ఈ నివేదిక ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.

కన్న కూతురిపై అత్యాచారం..
పంజాబ్ లుధియానాలో దారుణం జరిగింది. కన్న కూతురిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తండ్రి. బాధితురాలి ఇరుగుపొరుగువారు ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితుడు ముకేశ్​ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. 11 ఏళ్ల బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.